ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా వారి ఓట్లతో గెలిచి వారిని మోసం చేసి ఇతర పార్టీల్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అంటూ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల మనోభీష్టానికి విరుద్దంగా… టీఆర్ఎష్ కు అమ్ముడుపోయిన సన్నాసులకు సిగ్గుండాలన్నారు. అలాంటి వారిని రాళ్లతో కొట్టడానికి కార్యకర్తలు సిద్ధపడాలని, దానికి నేనే ముందు ఉంటానన్నారు.
మణికొండ పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను కలవడానికి ఆయన మణికొండ వెళ్లారు. రేవంత్ ఎక్కడికి వెళ్లినా జనం నుంచి అనూహ్య స్పందన కనిపించడం విశేషం.
కేసీఆర్ సంతలో పశువులను కొన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఆటలు కట్టించి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టనున్నట్లు తెలిపారు.