కేసీయార్ ఇంట్లో వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సభ జరిగింది. నిరుద్యోగ సభలో రేవంత్ మాట్లాడుతు కేసీఆర్ ఇంట్లోని నలుగురికి ఉద్యోగాలు పోతేనే మనకందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. అంటే ముఖ్యమంత్రిగా కేసీయార్, కొడుకు కేటీయార్ మంత్రిగాను, కూతురు కవిత ఎంఎల్సీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మేనల్లుడు హరీష్ రావు మరో మంత్రిగా ఉన్నారు. అందుకనే కేసీయార్ కుటుంబంలో ఉద్యోగాలు పోవాలని చెప్పింది.
లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వలేని కేసీయార్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని వంద మీటర్ల లోతులో గొయ్యితీసి పాతిపెట్టాలన్నారు. కేసీయార్ కుటుంబంలోని వాళ్ళకి ఉద్యోగాలను ఊడబీకే కార్యక్రమానికి నల్గొండ జిల్లానే నడుంబిగించాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. 30 లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఇళ్ళకు వెళ్ళి తల్లి దండ్రులకు మొహాలు చూపలేక నానా అవస్థలు పడుతున్నట్లు మండిపడ్దారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలని రేవంత్ జనతా బార్లో పర్మిట్ రూములతో పోల్చారు. పంటలు ఎండిపోయి, అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయి నానా అవస్థలు పడుతుంటే కేసీయార్ మాత్రం తాగుబాతుల సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. పేరుకు మాత్రమే బంగారు తెలంగాణా గా రేవంత్ అభివర్ణించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే బంగారు తెలంగాణా వచ్చిందా అని ప్రశ్నించారు.
బిడ్డను బిర్లాను, అల్లుడ్ని అంబానీగా, కొడుకును టాటాను చేసినట్లు సెటైర్లు వేశారు. కేసీయార్ మాత్రం ఛార్లెస్ శోబరాజ్ గా మారిపోయినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి శాసనసభ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్నుయాని అడిగితే లక్ష ఖాళీలున్నట్లు చెప్పినట్లు చెప్పారు. తొమ్మిదేళ్ళ తర్వాత 1.92 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వ కమీషనే చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. నిజంగానే కేసీయార్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీచేస్తే ఖాళీ ఉద్యోగాలు తగ్గాలి కదాని రేవంత్ ప్రశ్నించారు. మొత్తానికి గ్రాండ్ సక్సెస్ అయిన నల్గొండ సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ అభినందనలతో ముంచెత్తటం గమనార్హం.