రేవంత్ రెడ్డిని టిపిసిసి చీఫ్గా నియమించడం ద్వారా 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కాంగ్రెస్ తన ట్రంప్ కార్డును వేసింది. ఈ నిర్ణయంతో తటస్తుల్లో కూడా కాంగ్రెస్ పైన తెలంగాణలో హోప్ కలిగింది.
2023 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి విజయవంతం కాగలరని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2023 సార్వత్రిక ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను 2023లో అధికారంలోకి వస్తుంది. ఏ కేసీఆర్ అయితే కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాడో అదే వ్యక్తిని ఆయుధంగా వాడి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ అన్నారు.
“2014 లోనే కాకుండా 2018 లో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి, కెసిఆర్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నారు. చరిత్ర పునరావృతమవుతుంది, కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని సాధిస్తుంది, ” అని రేవంత్ చెప్పారు.
కెసిఆర్ పాలన, అహంకారంతో జనం విసిగిపోయారు. సామాన్య ప్రజల హృదయాలనిండా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష నిండిపోయిందని రేవంత్ అన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ… ఇది కెసిఆర్ మరియు అతని తాజా శత్రువు ఈటల రాజేందర్ మధ్య వ్యక్తిగత పోరాటం అని రేవంత్ చెప్పారు.