చీటికి మాటికి బూతు ట్వీట్లువేసి ఎంపీ స్థాయికే మచ్చ తెచ్చిన వ్యక్తి అని విజయసాయిరెడ్డి పై ఇప్పటివరకు అనేక విమర్శలు వచ్చాయి. నిజానికి అతని ట్వీట్లు కూడా అలాగే థర్డ్ గ్రేడ్ స్థాయిలో ఉంటాయి. మాటిమాటికి బూతు భాష వాడుతూ నీచమైన పదజాలతో అందరినీ దూషించడం ముందునుంచి విజయసాయికి అలవాటే.
తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ ఛీఫ్ పదవి ఇప్పించాడు అని కూడా సాయిరెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్లో వెంకటకృష్ణ రేవంత్ రెడ్డి స్పందన అడిగారు. దానికి సింపుల్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రేవంత్ రెడ్డి సాయిరెడ్డిని పూచికపుల్లకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు.
విజయసాయిరెడ్డి రాజకీయంగా అణాపైసా విలువ చేయడని, సింహాసనం మీద కూర్చున్న శునకం అని, తిక్కలోడు విజయసాయిరెడ్డి మాటలు పట్టించుకోనని చెప్పారు. దీంతో విజయసాయిరెడ్డి పరువును గంగలో కలిపేశాడు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కాళ్లు మొక్కిన విజయసాయిరెడ్డి స్థాయి అందరికీ తెలిసిందే. ఆంధ్రా అయ్యవార్లను తిట్టి మళ్లీ జగన్ మా ఫ్రెండ్ అన్నదీ కేసీఆర్… వీరి డ్రామాలు ఎవరికి తెలియవు. కేసీఆర్ కు నొప్పి కలిగితే వాళ్లు స్పందంచకుండా ఎలా ఉంటారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
జగన్ నీటిని దోచుకుపోతున్నది నిజమే… ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో కూడా చెప్పాలని మండిపడ్డారు.