టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఓటుకు నోటు ఇప్పుడు సీటుకో రేటు అని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి కాదని రేటెంత రెడ్డి అంటున్నారని సెటైర్లు వేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు. పైసలున్నోళ్లకే టికెట్లు అమ్ముకుంటున్నారని, ఇస్తున్నారని, రాబోయే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారని రాసి పెట్టుకోవాలని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని, 1999లో కిషన్ రెడ్డికి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. పాతికేళ్లుగా బిజెపితో తెరచాటు వ్యాపారాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారని, ఆ గాడ్సేను గాంధీభవన్లో కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలేనని ఆరోపించారు. ఏ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని, 23 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఏ టీం అని చెప్పారు. కేంద్రంలో బీఆర్ఎస్ పాత్ర లేనిదే ప్రభుత్వాలు ఏర్పడని పరిస్థితిని తెకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.