ఏపీ సీఎం జగన్ గురించి గడిచిన 24 గంటలుగా ట్వీట్టర్లో ఒక విషయం హల్చల్ చేస్తోంది.
కరోనా కట్టడిలో సరైన విధంగా స్పందించలేదని పేర్కొం టూ.. తక్షణమే సీఎం పదవికి రిజైన్ చేయాలని.. కోరుతూ.. ట్వీట్లు చేస్తున్నారు.
ట్విటర్లో #Resign Jagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు లో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఓ వారంలో ఇటువంటి సంఘటనలు అనంతపురం, కర్నూలు సహా మరికొన్ని చోట్ల కూడా జరిగాయి.
దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు.
కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చిన ప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదని.. చాలా మంది ప్రశ్ని స్తున్నారు.
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇక, వ్యాక్సిన్‌ను కూడా జగన్ అందించలేక పోతున్నారని.. విమర్శలు వస్తున్నాయి.
నిజానికి కొన్నాళ్ల కిందట.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైనా ఇలానే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జనాలు.. రాజీనామా చేయాలంటూ.. డిమాండ్ చేయడం గమనార్హం.
ఇప్పుడు అంతే సెగ ఇప్పుడు కేవలం ఏపీ సీఎం జగన్‌కే ఎదురు కావడం గమనార్హం.
అయితే.. అప్పట్లో విపక్షాల కుట్ర ఉందని.. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడు వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారు.
దీనికి ప్రధాన కారణం.. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న దాడేనని.. నిజానికి విఫలమైన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సి వస్తే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం, కర్ణాటక ముఖ్యమంత్రి వంటివారు చాలా మంది ఉన్నారని.. అక్కడ వందల సంఖ్యలో మరణాలు తెరమీదికి వస్తున్నాయని అంటున్నారు. సో.. ఇలాంటి రాజకీయాలు సరికాదని చెబుతున్నారు.
మరి ఇలాంటి రాజకీయాలు చేయడం ఏమేరకు సమంజసమో.. ఆలోచించుకోవాలని.. విమర్శకులకు వైసీపీ నేతలు సూచిస్తున్నారు.