సామాన్యులకే కాదు…రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, క్రీడాకారులకు కూడా సెంటిమెంట్లుంటాయి. ఇంకా చెప్పాలంటే సామాన్యులకన్నా ఒకింత ఎక్కువే ఉంటాయి. మన టాలీవుడ్ హీరోల్లో చాలామంది ముహూర్త బలాన్ని, జ్యాతకాలను, న్యూమరాలజీని బలంగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ నంబర్ గేమ్ ను ఫాలో అవుతుంటారని చాలామంది అనుకుంటుంటారు.
కార్లంటే అమితంగా ఇష్టపడే తారక్ కాంపౌండ్లో విదేశీ కార్లతో సహా అనేక కార్లున్న సంగతి తెలిసిందే. కార్లు వేరైనా…వాటి నంబర్ ప్లేట్ లోని అంకెలు మాత్రం ఒకటే. తారక్ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. దీంతో, తారక్ లక్కీ నంబర్ 9 అని చాలామంది అనుకుంటుంటుటారు. ఇక, న్యూమరాలజీ ప్రకారం తారక్ ఆ 9999 నంబర్ ను మెయింటెన్ చేస్తున్నారని మరికొందరు అంటుంటారు. తారక్ కు ఆ నంబర్ అంటే సెంటిమెంట్ అని సన్నిహితులు చెబుతుంటారు. అయితే, తారక్ కార్ల నంబర్ గేమ్ వెనుకున్న అసలు కారణం అది కాదు.
వాస్తవానికి తారక్ కు అటువంటి సెంటిమెంట్లు లేవట. కానీ, ఓ ప్రత్యేకతోనే యంగ్ టైగర్ ఆ నంబర్ ను అన్ని కార్లకు మెయింటెన్ చేస్తున్నారట. తన తాత నందమూరి తారక రామారావు, తన తండ్రి హరికృష్ట ఇద్దరూ ఆ నెంబర్ వాడేవారట. అందుకే, తాతాతండ్రుల సెంటిమెంట్ ను తారక్ కూడా కంటిన్యూ చేస్తున్నాడట. కారు నంబరే కాదు, జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా @tarak9999లోను 9999 ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా తారకే వెల్లడించాడు. మొత్తానికి 9999 నంబర్ వెనుకున్న సీక్రెట్ ను తారక్ చెప్పేయడంతో దాని వెనుకున్న పుకార్లన్నీ పటాపంచలయ్యాయి.