కోవిడ్ -19 కారణంగా తీవ్రంగా నష్టపోయిన రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పుంజుకుంటోంది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ఊపందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లు కూడా భారీగా పెరుగుతున్నాయి.
మొదటి మరియు రెండవ త్రైమాసికంలో, రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయానికి ఆటంకం ఏర్పడింది, ఎందుకంటే రెండవ వేవ్ నేపథ్యంలో గృహాలను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
అనేక రంగాలు మరియు పరిశ్రమలు దాదాపు పూర్వ స్థితికి చేరుకుంటూ ఉండటంతో డబ్బు రొటేషన్ కూడా పెరిగింది. మళ్లీ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రియల్టీ రంగం ఊపిరి పీల్చుకుంది.
అనారోక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రకారం, హైదరాబాద్ Q3 2021 లో సుమారుగా 6,735 యూనిట్లను విక్రయించింది. ఇదే క్వార్టర్ లో గత ఏడాది కంటే ఇపుడు 300 శాతం ఎక్కువ. దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు పెరిగాయి.
డిమాండ్ పెరగడంతో అమ్మకాల్లో 113 శాతం పెరుగుదల నమోదైంది. అయితే.. ఇందులో హైదరాబాదు మార్కెట్ చాలా బాగుంది. ఉత్తర భారతదేశంలో కేవలం ఢిల్లీ, నొయిడాలోనే మార్కెట్ బాగుంది. కానీ సౌత్ లో అన్ని ప్రధాన నగరాల్లో డిమాండ్ బాగా పెరిగింది. అమ్మకాలు పెరిగాయి. హైదరాబాదు ధరలు బెంగుళూరు ధరలతో ఇపుడు పోటీ ఇస్తుండటం గమనార్హం.