ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో లిప్ లాక్ లు సర్వ సాధారణమయ్యాయి. కుర్ర హీరోలకు పోటీ పడుతూ సీనియర్ హీరోలు కూడా ముద్దుల పోటీలో మేమేం తక్కువ కాదు అనే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఈ కోవలోనే ఇటీవలి కాలంలో మాస్ మహారాజా రవితేజ తన హీరోయిన్లతో లిప్ లాక్ సీన్లలో నటించి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. డింపుల్ హయాతి, ఖిలాడీలో మీనాక్షి చౌదరి, రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్..ఇలా ఈ ముగ్గురు భామలతో రవితేజ లిప్ లాక్ హాట్ లిప్ లాక్ సీన్లు క్రేజీగా మారాయి.
వీరంతా, రవితేజ (54) వయసులో సగం ఉన్నవారే. దీంతో, అదే ఊపులో తాజాగా ధమాకా చిత్రంలో తన సరసన నటిస్తున్న శ్రీ లీలతో కూడా రవితేజ లిప్ లాక్ సీన్లలో రెచ్చి పోయి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ, ఆ అమ్మడితో లిప్ లాక్ సీన్లలో నటించేందుకు మాత్రం ఈ మాస్ హీరో ససేమిరా అన్నాడట. 54 ఏళ్ల రవితేజ 21 ఏళ్ల యంగ్ బ్యూటీ శ్రీ లీలతో ముద్దు సీన్లకు నో చెప్పాడని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రవితేజ, శ్రీ లీలల ఏజ్ గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.
అంతేకాదు, గతంలో రవితేజ…హీరోయిన్ తో లిప్ లాక్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ లుగా మిగిలాయి. అందుకే, ఈ రెండు కారణాలతో ఈ మాస్ స్టార్ హీరో ముద్దులు మానేశాడని టాక్. దాంతోపాటు, ధమాకా దర్శకుడు నక్కిన త్రినాథ రావు…హీరోయిన్లతో లిప్ లాక్ లు, మసాలా సీన్లు వంటి వాటిపై పెద్ద ఆసక్తి చూపే టైప్ కాదు. అయితే, రవితేజ ఇటీవల తన సినిమాల్లో లిప్ లాక్స్ చేస్తుండడంతో ఈ సినిమాలో కూడా దాన్ని ఫాలో అయి ఉంటాడని అనుకుంటున్నారు. మరి, రవితేజ సెంటిమెంట్, ఏజ్ గ్యాప్ వల్ల లిప్ లాక్స్ కు గుడ్ బై చెప్పాడా..లేదా అన్నది తేలాలంటే డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడక తప్పదు.