వరుస సినిమాలతో దూకుడు మీదున్న రవితేజ.. రీసెంట్గా సుధీర్ వర్మ డైరెక్షన్లో తన డెబ్భయ్యో సినిమాని అనౌన్స్ చేశాడు. హీరోలంతా ఒకదాని తర్వాత ఒకటిగా తమ సినిమాల్ని పట్టాలెక్కిస్తుంటే.. రవితేజ మాత్రం ఒకటి సెట్‌మీద ఉండగానే మరో రెండు సినిమాలు చేసేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఆల్రెడీ ‘ఖిలాడి’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘ధమాకా’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావచ్చింది. వీటిలో ఒకటి రిలీజ్ కాగానే సుధీర్ వర్మ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని టైటిల్‌తో కాకుండా ‘హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్’ అంటూ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ చిత్రానికి ‘రావణాసుర’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ట్యాగ్‌లైన్‌ని బట్టి చూస్తే ఈ వార్త నిజమే అయ్యుండొచ్చనిపిస్తోంది. రావణాసుర.. హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది కనుక సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమనిపిస్తోంది.
సుధీర్ వర్మ అనగానే స్వామి రారా, కేశవ లాంటి థ్రిల్లర్స్ గుర్తొస్తాయి. ఆ సినిమాలు మంచి రిజల్ట్‌ని ఇచ్చినా.. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘రణరంగం’ మాత్రం నిరాశపర్చింది. అయితే ఈమధ్య రవితేజ ఏదో ఒక వెరైటీ ఉంటే తప్ప ఏ సినిమాకీ ఓకే చెప్పడం లేదు.
పైగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి సుధీర్ కచ్చితంగా ఏదో కొత్త తరహా సబ్జెక్ట్‌నే ప్లాన్ చేసి ఉండొచ్చు. మరో మూడు రోజుల్లో టైటిల్, లుక్ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ సినిమాపై మరింత క్లారిటీ రావొచ్చు.