టాలీవుడ్ హీరో రవితేజ తాజాగా ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. షాక్, మిరపకాయ్ చిత్రాల తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి `మిస్టర్ బచ్చన్` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు.
బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ మూవీ `రైడ్` కి తెలుగు రీమేక్ ఇది. మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లోయలో జరుగుతుంది. అక్కడ అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ ను చిత్రీకరిస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సెట్స్ నుంచి రవితేజ స్టైలిష్ ఫోటోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. `ప్రపంచంలో అందరికీ వయసు వస్తోంది.. అన్నయ్యకు తప్ప` అంటూ రవితేజను ఉద్దేశించి క్యాప్షన్ కూడా ఇచ్చారు.
అయితే హరీష్ శంకర్ పోస్ట్ కు రవితేజ తాజాగా రిప్లై ఇచ్చారు. `ఓవర్ చేయకు రోయ్.. నీ దిష్టే తగిలేలా ఉందీ..` అంటూ సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి సన్నిహిత్యం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవితేజ హీరోగా నటించిన షాక్ మూవీ తోనే హరీష్ శంకర్ దర్శకుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. షాక్ పరాజయం పాలవ్వడంతో హరీష్ శంకర్ కు చాలా కాలం ఎవరు అవకాశం ఇవ్వలేదు.
అటువంటి తరుణంలో రవితేజనే మళ్లీ హరీష్ శంకర్ తో తో వర్క్ చేసేందుకు మొగ్గు చూపాడు. అలా వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం మిరపకాయ్ సూపర్ సూపర్ హిట్ అయింది. దాంతో హరీష్ ఇండస్ట్రీలో నెలదొక్కుకున్నాడు. గబ్బర్ సింగ్ తో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ తో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా హరీష్ శంకర్ చేస్తున్నాడు.
Over cheyaku roiiiii ..
Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024