టాలీవుడ్ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండల మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలాకాలంగా పుకార్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ లో రష్మిక నటించడం సంచలనం రేపింది. ఆ లిప్ లాక్ వల్లే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. టాలీవుడ్ లో సినిమాల కోసం, విజయ్ తో డేటింగ్ కోసం రక్షిత్ శెట్టికి రష్మిక బాయ్ బాయ్ చెప్పేసిందని గాసిప్స్ వినిపించాయి.
ఆ గాసిప్స్ కు తగ్గట్లుగానే విజయ్, రష్మికలు కొద్ది నెలల క్రితం ముంబైలో పార్టీలకు, పబ్ లకు చెట్టాపట్టాలేసుకొని వెళ్లిన ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో, రష్మికకు మీడియా నుంచి ఆ డేటింగ్ వ్యవహారంపై తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక ఆ రూమర్లపై స్పందించింది. విజయ్ తో డేటింగ్ లో ఉన్నారా అని బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నలకు రష్మిక చిరాకు పడింది. ఒకింత అసహనంగానే విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చింది.
తాను ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నానని, వాటి గురించి అడగొచ్చు కదా అని రష్మిక కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. లైమ్ లైట్ లో ఉన్న హీరోయిన్లు, హీరోలపై ఇటువంటి పుకార్లు సహజమని, వారి గురించి తెలుసుకోవాలని జనానికి ఎక్కువ ఆసక్తి ఉంటుందని, దానిని తాను అర్థం చేసుకోగలనని రష్మిక చెప్పింది. కానీ, విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని, విజయ్ తో తాను డేటింగ్ లో లేనని రష్మిక క్లారిటీ ఇచ్చింది.
అయితే, ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ తో కలిసి పాల్గొన్న హీరోయిన్ అనన్య పాండే ఈ డేటింగ్ వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన సంగతి తెలిసిందే. రష్…మిక అంటూ ఆ షోలో కరణ్ అడిగిన ప్రశ్నకు అనన్య పాండే చేసిన కామెంట్లు ఆ డేటింగ్ రూమర్లు నిజమనుకునేలా చేశాయి. అయితే, తాజాగా రష్మిక ఇచ్చిన క్లారిటీతోనైనా ఆ రూమర్లకు, పుకార్లకు చెక్ పడుతుందేమో వేచి చూడాలి.
ఇక, ఇటీవల పొట్టి బ్లాక్ డ్రెస్ వేసుకొని దానిని కవర్ చేయలేక ఇబ్బందిపడ్డ రష్మిక…తాజాగా మరోసారి రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకొని నానా తిప్పలు పడింది. దీంతో, అలాంటి డ్రెస్ లు వేసుకొని ఇబ్బంది పడడం ఎందుకంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా రెడ్ హాట్ డ్రెస్ లో రష్మిక క్లివేజ్ షో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.