టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కాంతార చిత్రం గురించి రష్మిక స్పందించేదంటూ పుకార్లు వచ్చాయి. తన మాజీ లవర్ రక్షిత్ శెట్టి దర్శకత్వం వహించి,నటించిన ఈ చిత్రాన్ని పొగిడేందుకు రష్మికకు నోరు రాలేదని ట్రోలింగ్ కూడా జరిగింది. కన్నడ బ్యూటీ అయిన రష్మిక…ఘన విజయం సాధించిన ఈ కన్నడ చిత్రం గురించి కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం దుమారం రేపింది.
దీనికి తోడు తెలుగు, తమిళ్ లో బిజీ అయిన రష్మిక..కన్నడ సినిమాలను ఇగ్నోర్ చేస్తోందని పుకార్లు కూడా వచ్చాయి. దీంతో, ఆమెపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించిందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారంపై రష్మిక స్పందించింది. కన్నడ చిత్ర పరిశ్రమ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది. కాంతార’ చిత్రం విషయంలో తనపై కొందరు అత్యుత్సాహం చూపించారని రష్మిక వెల్లడించింది.
అంతేకాదు, కాంతార చిత్ర యూనిట్ కు తాను మెసేజ్ పెట్టానని, సినీ నటుల మధ్య ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదని చెప్పుకొచ్చింది. ఇక, తన వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు అవసరం లేదని, వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పడం తన బాధ్యత అని రియాక్ట్ అయింది. తన పర్సనల్ విషయాలను కూడా కెమెరా పెట్టి అందరికీ చూపలేనని, మెసేజ్ లు బయటికి విడుదల చేయలేనని రష్మిక స్పష్టం చేసింది. మరి, రష్మిక క్లారిటీతోనైనా ఆ పుకార్లకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి.