రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది. బద్ధ శత్రువులను ప్రాణ మిత్రులుగా మారిపోతారు. ప్రాణ మిత్రులు విరోధులుగా మారడం రాజకీయాల్లో సాధరణమే. దశాబ్దాల వైరం రాజకీయం పేరుతో పైకి మాయమైపోయినట్లు కనిపిస్తుంది. అయితే కాలం అన్నిటికీ పరిష్కారాలు వెతికిపెడుతోంది. పగలు పోయాయి. ప్రతికారాలు తగ్గాయి. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలను చంద్రబాబు ఏకం చేశారు. అనంతపురంలో లోకేష్ పర్యటనతో జేసీ ప్రభాకర్ రెడ్డిని పరిటాల శ్రీరామ్ మరింత దగ్గరయ్యారు.
అనంతపురం జిల్లాలో ఈ రోజు లోకేష్ పర్యటించారు. లోకేష్ కు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలంగా వచ్చారు. ఆహ్వానం పలికేందుకు వచ్చిన నేతల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శీరామ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతేనా శ్రీరామ్ ను దగ్గరకు పిలిచి ప్రభాకర్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డి పెద్దరికాన్ని గౌరవించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లారు. ఆయన ముందే నిలబడ్డ శ్రీరామ్ భుజంపై చేసి స్వత బిడ్డలా అక్కున చేర్చుకున్నారు.
ఇద్దరి మధ్య కాసేపు మాటా ముచ్చట సాగింది. ఇద్దరూ కశల ప్రశ్నలూ వేసుకున్నారు. ఇద్దరూ కలిసి లోకేష్ కోసం కొద్దిసేపు ఎదురు చూశారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సన్నివేశం చూసిన తెలుగుదేశం తమ్ముళ్లు తెగ సంబరపడుతున్నారు. పరిటాల, జేసీ కుటుంబం ఒకే వేదికపై ఒకరిని ఒకరి ఆత్మీయంగా పలకించుకోవడం మంచి పరిణామని తమ్ముళ్లు ఆనందపడుతున్నారు. అప్పుడు ఈ రెండు కుటుంబాలను చంద్రబాబు ఏకం చేస్తే.. ఇప్పుడు లోకేష్ మరింత దగ్గరకు చేర్చారని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.
అనంతపురం జిల్లాలో పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. జేసీ కుటుంబంపై రవిదే పై చేయి ఉండేదని చెబుతుంటారు. రవి కుటుంబం మొదటి నుంచి టీడీపీలోనే ఉంది. రవి హత్య జరిగినప్పుడు పరిటాల సునీత దివాకర్ రెడ్డిపై ఆరోపణలు కూడా చేశారు. రవి చనిపోయిన తర్వాత సునీత రాప్తాడు నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. అనివార్యంగా జేసీ కుటుంబం టీడీపీలోకి వచ్చింది.
టీడీపీలోకి జేసీ కుటుంబం రావడాన్ని పరిటాల ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకిందని అప్పుట్లో పెద్ద చర్చే జరిగింది. పార్టీ మారిన తర్వాత కూడా పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పెద్దగా మాటల్లేవు. ఒకే వేదికను పంచుకున్నా ఎడముఖం పెడముఖంగా ఉండేవారు. ఒకే పార్టీలో ఉన్నా వీరు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భాలు లేవు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పరిటాల, జేసీ వర్గాలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చాయి. చంద్రబాబు జోక్యంతో క్రమక్రమంగా తగ్గతూ వచ్చింది. ఇప్పుడు రెండు కుటుంబాలు టీడీపీ కోసం కలిసి పనిచేస్తున్నాయి.