టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పాండ్యాతోపాటు టీమిండియా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్‌శుక్లాపై అండర్‌వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య రెహ్నూమా సంచలన ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురితోపాటు చాలా పెద్దపెద్ద వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకంల రేపుతోంది.
అంతేకాదు, తన భర్త రియాజే బలవంతంగా తనను వీఐపీల దగ్గరకు పంపించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై కేసు పెట్టాల్సిందిగా గత 2 నెలలుగా తిరుగుతున్నా ముంబై పోలీసులు పట్టించుకోవడం ఆమె ఆరోపించింది. ముంబై ట్రైడెంట్ హోటల్లో హార్థిక్ పాండ్యా, అతడి ఇద్దరు స్నేహితులు, కాంటినెంటల్ హోటళ్లో మునాఫ్ పటేల్ తనను రేప్ చేశారని ఆమె షాకింగ్ ఆరోపణలు చేసింది. అంతేకాదు, రాజీవ్‌శుక్లా, అతడి స్నేహితులు తనపై లైంగిక దాడిచేసి చిత్రవధకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
తన భర్త రియాజ్ భాటీ భారీ స్థాయలో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని, ముంబైలోని చాలామంది బడా బిజినెస్మెన్లు, హై ప్రొఫైల్ వ్యక్తుల దగ్గరకు తనను బలవంతంగా పంపించేవాడని ఆరోపించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించింది. అయితే, రెహ్నూమా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. గతంలో భారత్ లో జరిగిన ఐపీఎల్ సందర్భంగా ఈ వ్యవహారం జరిగి ఉంటుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.