ఈనాడు సంస్థల అధినేతగా, ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ద్వారా నిర్మాతగానే రామోజీరావు అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక సినిమాలో నటించారు. 1978లో యు విశ్వేశ్వర రావు నిర్మించిన మార్పు అనే సినిమాలో రామోజీరావు ఒక న్యాయమూర్తి పాత్రలో నటించారు. ఆయన నటించింది అతిథి పాత్రలోనే అయినా సినిమా పోస్టర్ లపై రామోజీరావు బొమ్మ అప్పట్లో ప్రచురించడం హాట్ టాపిక్ అయింది.
అలాగే రామోజీరావు చాలా మంది హీరోలను వెండితెరకు పరిచయం చేశారు . ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ చిత్రం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా అయింది.
అలాగే తరుణ్ ను హీరోగా పరిచయం చేస్తూ నువ్వే కావలి సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. తనీష్ ను హీరోగా పరిచయం చేస్తూ.. నచ్చావులే సినిమా నిర్మించారు. ఇక ఆయన నిర్మించిన చివరి సినిమా రాజేంద్ర ప్రసాద్ హీరోగా తీసిన దాగుడుమూత దండాకోర్.