ఖిలాడి సినిమా డైరెక్టర్ రమేష్ వర్మతో హీరో రవితేజకు పడట్లేదనే వార్తలు కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఖిలాడి ప్రి రిలీజ్ ప్రమోషన్లలో రవితేజ పాల్గొనకపోవడం.. ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా రమేష్ వర్మ మీద సెటైర్లు వేస్తున్నట్లుగా మాట్లాడ్డం.. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం నిర్మాత, రచయిత అని చెబుతూ రమేష్‌కు క్రెడిట్ ఇవ్వకపోవడం అనేక సందేహాలు రేకెత్తించాయి.
ఖిలాడి రిలీజ్ తర్వాత రవితేజ అసలే దీని గురించి మాట్లాడట్లేదు. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డం కష్టంగానే కనిపిస్తోంది. ఖిలాడి రిజల్ట్.. రవితేజ వ్యాఖ్యలు రమేష్ వర్మకు బాగానే డ్యామేజ్ చేసేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో రమేష్ వర్మ భార్య రేఖ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. రవితేజ పేరెత్తకుండా ఆయనపై ఆమె సెటైర్లు వేసిందనట్లుగా కనిపిస్తోంది ఈ పోస్టులు చూస్తే.
ఒక పోస్టులో రేఖ వర్మ.. ‘‘గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది’’ అని పేర్కొంది.
ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి మహాసముద్రం సినిమాను రవితేజతోనే చేయాలనుకున్నాడు. కొన్ని రోజులు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఐతే ఉన్నట్లుండి రవితేజ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన్ని ఉద్దేశించే చీప్ స్టార్ అంటూ అజయ్ భూపతి ట్వీట్ పెట్టాడంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.
ఇప్పుడు రేఖ వర్మ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రవితేజపై కౌంటర్ వేసినట్లుగా కనిపిస్తోంది. అంతే కాక రవితేజను ఉద్దేశించే రేఖ వర్మ ఇంకో ఇన్‌స్టా స్టోరీ కూడా పెట్టింది. అందులో.. అరటిపండ్లు మీకు బాగా వచ్చు అనుకుంటా తీయడం.. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం క్లాసులు తీసుకోండి ఆర్.టి దగ్గర. అరటిచెట్లు నరికి ఇచ్చినా సరిపోవట్లేదు ఆర్.టికి అని ఆమె పేర్కొంది. ఇక్కడ ఆర్.టి అంటే రవితేజే అన్నది స్పష్టం. మరి ఈ అరటిపండ్టడ్లు, అరటిచెట్ల గోలేంటో తెలియదు మరి. ఈ పోస్టుల్ని బట్టి చూస్తే రవితేజకు, రమేష్ వర్మకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. తన భర్తతో రవితేజ వ్యవహరిస్తున్న తీరుతో రేఖ బాగా హర్టయిందని స్పస్టమవుతోంది.