ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదలైన భారీ చిత్రాల్లో `డబుల్ ఇస్మార్ట్` ఒకటి. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించారు. పూరి జగన్నాథ్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
అయితే సీక్వెల్ హైప్ అండ్ హాలిడే అడ్వాంటేజ్ ఉండటం వల్ల డబుల్ ఇస్మార్ట్ భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుందని అంచనా వేశారు. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. పోటీగా మిస్టర్ బచ్చన్, ఆయ్, తంగలాన్ వంటి చిత్రాలు ఉండడం వల్ల వసూళ్ల పరంగా డబుల్ ఇస్మార్ట్ అంచనాలను అందుకోలేకపోయింది.
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.10 కోట్ల షేర్, రూ. 8.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన రామ్ లేటెస్ట్ మూవీ.. వరల్డ్ వైడ్ గా రూ.7.30 కోట్ల షేర్, రూ. 10.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48 కోట్ల దాకా జరగగా.. డబుల్ ఇస్మార్ట్ మూవీ రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దూకుంది. ఇప్పుడు ఈ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 41.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి మిక్స్డ్ టాక్ తో డబుల్ ఇస్మార్ట్ ఈ మేరకు పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.