ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) న్యూజెర్సీ కో- ఆర్డినేటర్ ‘రాజా కసుకుర్తి’ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ పోలీసు స్టేషన్ లొ పొలిసులకు మరియు గ్రామస్తులకు హెల్మెట్ లు , రైతులకు పురుగు మందు స్పేర్ యంత్రాలు, రైతు సెఫ్టీ కిట్లు పంపణీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐడి ఏఎస్పీ గోపాలకృష్ణ, హనుమాన్ జంక్షన్ సిఐ డి.వి వెంకటరమణ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రైతులకు 8 స్పేర్ యంత్రాలు & 50 రైతు సెఫ్టీ కిట్లు, పొలిసులకు మరియు గ్రామస్తులకు కలిపి 78 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా పొలిసు సిబ్బందికి ‘తానా ‘తరుపున చీరలు పంపిణి చెసారు.
వీరవల్లీ గ్రామస్తుడు ‘రాజా కసుకుర్తి’విదేశాల్లో స్ధిరపడిన తాను పుట్టిన జన్మభూమిని మరిచిపోకుండా ‘తానా’ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలలొ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించటం ద్వారా అందరికి స్ఫూర్తి గా నిలుస్తున్నారని అన్నారు. సిఐడి ఏఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ తానా చెస్తున్న వివిధ సెవా కర్యక్రమాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ మదీనాబాషా సొసైటీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు లంక సురేంద్ర మోహన బేనర్జీ , గుండపనేని ఉమావరప్రసాద్ , కలపాల శ్రీధర్, మాజీ సర్పంచ్ నందమూరి కృష్ణప్రసాద్ , కలపాల నాని , అరవపల్లి అచ్యుతరామయ్య , బడగల కృష్ణ ,శివ పలువురు పోలీసు సిబ్బంది , గ్రామస్తులు , రైతులు పాల్గొన్నారు.