అమెరికా 46వ అధ్యక్షుడి అవతరణ
Today, we begin anew. Tune in for #Inauguration2021. https://t.co/HxfU8q5riA
— Joe Biden (@JoeBiden) January 20, 2021
అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. నేటినుంచి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. అమెరికా అత్యంత క్లిష్టతర సమయంలో పదవిని స్వీకరించిన వ్యక్తిగా బిడెన్ ను గుర్తించవచ్చు.
కోవిడ్ -19 మహమ్మారి విశ్వరూపాన్ని చూసినఅతి క్లిష్ట సమయాన, రాజకీయపు, ప్రజాస్వామ్యపై నీచమైన లోతులకు దిగజారిన సమయాన అమెరికా దేశపు నాయకత్వ పగ్గాలు బిడెన్ చేతికి వచ్చాయి.
ఈరోజు జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో జో బిడెన్ అధ్యక్షుడిగా మరియు కమలా హారిస్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశపు తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజా మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి వైట్ హౌస్ నుంచి బయటకు నడిచారు.
ఈరోజు భారతదానికి కూడా కీలక ఘట్టం. భారత సంతతి మహిళ తొలిసారి అమెరికా ఉపాధ్యక్ష పీఠాన్ని అధిరోహించింది.
It's an honor to be your Vice President. pic.twitter.com/iM3BxJzz6E
— Vice President Kamala Harris (@VP) January 20, 2021
ప్రధాని మోడీ అభినందనలు
అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ తొలిసారిగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు మరియు "సాధారణ సవాళ్లను పరిష్కరించడంలో మేము ఐక్యంగా, స్థితప్రజ్జతతో కలిసి సాగుతాం’’ అని మోడీ ట్వీట్ చేశారు. మాకు గణనీయమైన మరియు బహుముఖ ద్వైపాక్షిక ఎజెండా ఉంది, భారతదేశం-యుఎస్ భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి అధ్యక్షుడు జోబిడెన్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం ” అని మోడీ ప్రకటించారు.
My warmest congratulations to @JoeBiden on his assumption of office as President of the United States of America. I look forward to working with him to strengthen India-US strategic partnership.
— Narendra Modi (@narendramodi) January 20, 2021