కాంగ్రెస్ ఆశాదీపం రాహుల్ గాంధీని ఈరోజు పార్లమెంటులో సొంత ఎంపీలే గుర్తుపట్టని పరిస్థితి వచ్చింది. అయితే, దీనికో కారణం ఉంది. సాధారణంగా రాహుల్ కుర్తా పైజామాలో పార్లమెంటుకు వస్తారు. కానీ తాజాగా రాహుల్ గాంధీ టక్ జగదీష్ లాగ టక్ చేసుకుని, తెలుగు సినిమాల్లో కనిపించే పదో తరగతి పిల్లాడిలా… వచ్చాడు. మరి మొహం చూసి గుర్తు పట్టొచ్చుగా అనుకోవచ్చు… కానీ మాస్కు ఉంది!
గుర్తుపట్టడం, పట్టకపోవడం పక్కన పెడితే రాహుల్ గాంధీ న్యూ లుక్ మాత్రం చర్చనీయాంశం అయ్యింది. నేటి రోజుల్లో రాజకీయాల్లో కూడా లుక్ కి ప్రాధాన్యం పెరిగిన విషయాన్ని మోడీ గుర్తించిన చాలా రోజులకు రాహుల్ గుర్తించినట్టుంది.
ఏది ఏమైనా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సరికొత్త లుక్ కాంగ్రెస్ వాళ్లకే కాదు, ఇతరులకు కూడా నచ్చింది. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో టక్ చేసుకుని పార్లమెంటుకు ట్యాబ్ పట్టుకుని వచ్చారు. మెట్ల వద్ద రెయిలింగ్ కి ఆనుకుని కనిపించిన రాహుల్ గాంధీని చాలాకొద్ది మాత్రమే గుర్తుపట్టగలిగారు.
ఇటీవలి రాహుల్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఉత్తరాదిపై కంటే దక్షిణాదిపై దృష్టిపెడితే ఎక్కువ లాభం అని రాహుల్ కి అర్థమైంది. కేరళ నుంచి మొన్న గెలిచిన రాహుల్ గాంధీని… ఇటీవల తమిళ కల్చర్ భలే పొగిడేశారు. ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుల పుట్టగొడుగుల బిర్యానీ తయారీలో పాల్గొని వైరల్ అయ్యారు. అందరితో కలిసి అక్కడే భోజనం చేశారు. రాహుల్ గాంధీలో వచ్చిన మార్పును చూసి, కాంగ్రెస్ నేతలు సంతోషపడుతున్నారు. ఇది పార్టీకి మేలు చేస్తుందా మరి?