కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పాగా వేసిన ముద్దుగుమ్మల్లో రష్మిక మందన్నా ఒకరు. `ఛలో` మూవీతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలోనే ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడబెట్టుకుంది.
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచీ రష్మిక `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకుంది. అలాగే తన మనసులో ఉన్న ఓ వింత కోరికను కూడా బయటపెట్టింది. రష్మిక మాట్లాడుతూ.. `ఆడవాళ్ళు మీరు జోహార్లు సినిమా చాలా బావుంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.
ఈ మూవీ చేశాక మళ్లీ జన్మంటూ ఉంటే మగాడిలానే పుట్టాలనిపించింది. ఎందుకంటే, ఈ సినిమాలో పెళ్లి చూపుల కారణంగా అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడతారో తెలిసింది. ఇష్టం ఉన్నా లేకపోయినా అందంగా ముస్తాబై.. అబ్బాయి, అతని కుటుంబసభ్యుల ముందు తల వంచుకుని కూర్చోవాలి. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అదే మగాడిలా పుడితే ఇవేమి చేయాల్సినవసరం లేదు. చక్కగా కాలు మీద కాలు వేసుకుని ప్రశ్నలు అడుగుతూ కూర్చోవచ్చు` అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు రష్మిక కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.