వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాకను అనుకున్నవిధంగానే అడ్డుకుంది ఏపీ సర్కారు. కక్ష సాధింపుల ముఖ్యమంత్రిగా దేశంలో పేరుమోసిన జగన్… తన ఇగో కోసం రఘురామరాజును అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. అనుకున్న విధంగానే రఘురామను అడ్డుకున్నట్టు అర్థమవుతోంది.
కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో ఎక్కడా కూడా స్థానిక ఎంపీ (నరసాపురం) పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. హెలి ప్యాడ్ దగ్గర ప్రధానికి ఆహ్వానం పలికేవారి జాబితాలో కానీ, వేదికపై ఆసీనులు అయ్యే వారి జాబితాలో కానీ, ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ ఎక్కడా కూడా రఘురామ కృష్ణం రాజు పేరు ప్రస్తావనలో లేదని ఏలూరు రేంజ్ డీఐజీ స్పష్టం చేశారు.
ఇదే విషయమై రఘు రామ కూడా స్పందిస్తూ పీఎం కు లేఖ రాశారు. ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేనందునే భీమవరంలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొనలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధి అయిన తాను కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అడ్డుకుంది అని ఆరోపిస్తూ ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం నా పేరు ఉండాలి కానీ లేదు అందుకే వెనుదిరగాల్సి వస్తోంది అని రఘురామకు సంబంధించి వర్గాలు చెబుతున్నాయి.
మొదట్నుంచి చెబుతున్న విధంగానే రఘురామ రాక కష్టమేనని నిర్థారణ అయింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతోనే ఆర్ఆర్ఆర్ ఈ వేడుకకు రాలేకపోతున్నారన్నది సుస్పష్టం అయింది.
నిన్నమొన్నటి వేళ లో కూడా ఆయనకూ, సాయిరెడ్డికీ ట్విటర్ వార్ జరిగింది. దీంతో ఆయన్ను అన్నివిధాలా నియంత్రించాలని ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలీకృతం అయ్యాయి.మరోవైపు ఆయనపై నమోదయిన కేసుల విషయమై సీఐడీ అధికారులు విచారణచేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.