మొదట్నుంచి ఏపీ ప్రజలను అలర్ట్ చేస్తూ మునిగిపోతున్న ఏపీ నావను పైకి లేపడానికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ వాళ్లు అతన్ని శత్రువుగా చూస్తూ వచ్చారు.
తాజాగా ఆయన రాష్ట్ర సర్కారు డొల్లతనంపై మరోసారి స్పందించారు. ఏపీని రుణాంధ్రప్రదేశ్ గా మార్చుతున్నారని అనేకసార్లు చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఈ ప్రభుత్వం ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళితే ప్రజలకే తీరని నష్టం.
అంతకంటే ముందు ఎన్నికల వరకు కూడా ప్రభుత్వాన్ని నడపని పరిస్థితి వస్తుంది. ఇది ప్రశ్నించినందుకు నాపై దేశద్రోహం కేసు పెట్టారని ఆరోపించారు.
నేను చెప్పినవి ఇపుడు ప్రజలకు అర్థమయ్యాయి. ఉండవల్లి అరుణ్ కుమార్, పవన్ కల్యాణ్ కూడా వాటిని ప్రశ్నిస్తున్నారు. మరి వారిపైనా రాజద్రోహం కేసు పెడతారా? అని ప్రశ్నించారు.
పరిస్థితులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినందుకే నన్ను శిక్షించాలని చూశారు. మీరు ఇరుక్కున్నారు. ఇపుడ రాష్ట్రాన్ని ఇరికించారు అని రఘురామ వ్యాఖ్యానించారు.
పత్రికల బాధ్యతను గుర్తించిన ఆంధ్రజ్యోతి పత్రిక అప్పుల వార్తను ప్రజల ముందు ఉంచింది. దానిపై కూడా కేసు పెట్టాలని చూసి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తిన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని అప్పులు చేశారని విమర్శించారు. ఇక నుంచి వడ్డీ భారమే ఏపీపై 50 వేల కోట్లు పడుతుంది. ఎలా కడతారు? అప్పు తెచ్చి ఆ డబ్బతో పాత అప్పులకు వడ్డీ కడతారా?