వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిలు ప్రక్రియ పూర్తయ్యింది. కొద్దిరోజుల క్రితమే బెయిల్ వచ్చినా టెక్నికల్ గా సోమవారం వరకు విడుదల కావడం కుదరల్లేదు. అయితే, సోమవారం విడుదలయ్యే అవకాశం ఉన్నా కూడా ప్రత్యేక వినతితో మరో రెండ్రోజులు చికిత్స కోసం రఘురామరాజు అక్కడే ఉన్నారు.
తాజాగా కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆర్మీ ఆస్పత్రి నేరుగా ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు లాయర్లకు చెప్పారట.
ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన బేగం పేట విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడి నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో రఘురామరాజు ఢిల్లీ వెళ్లారు. మరో గంటలో ఆయన ఢిల్లీ చేరుకుంటారు.
రఘురామరాజుకు స్పెషల్ ఫ్లైటా అని కొందరికి అనుమానం రావచ్చు… ఆయన చిన్న వ్యాపారి కాదు, విద్యుత్ రంగంలోనే ఆయన కంపెనీలు సుమారు 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయి.