నరసాపురం ఎంపీ రఘురామరాజును ముఖ్యమంత్రి జగన్ చాలా తక్కువ అంచనా వేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరైనా సులువుగా కంట్రోల్ చేయొచ్చు అనుకునే జగన్ మోహన్ రెడ్డికి రఘురామరాజు కొరకరాని కొయ్యగా మారారు.
జగన్ తన అధికారం మొత్తం ఉపయోగించి కేవలం కేసులు పెట్టి రెండ్రోజులు జైల్లో పెట్టించగలిగాడు. కానీ రఘురామరాజు ఒక ఎంపీగా ఉండి ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కొని అతనికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు.
జగన్ తన బలగం వాడితే… రఘురామరాజు తన బ్రెయిన్ వాడుతున్నాడు. జగన్ కొట్టిన చిన్న దెబ్బకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి ఎవరూ కొట్టనంత పెద్ద దెబ్బ కొడుతున్నాడు. ఆ దెబ్బతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
పెద్ద పదవుల్లో ఉన్నవారికే పరువే అన్నిటికంటే విలువైనది. దానిమీదే రఘురామరాజు దెబ్బ కొట్టాడు. ముందుగా సుప్రీంకోర్టులో ఏపీ పోలీసుల తీరు బయటపడేలా చేశాడు. ఆధారాలు సమర్పించాడు.
తర్వాత జగన్ పరపతిని దేశ వ్యాప్తంగా దెబ్బకొడుతూ 525 మంది ఎంపీలకు లేఖలు రాశాడు. ఆ లేఖలో రఘురామరాజు దెబ్బలకంటే కూడా జగన్ బెయిలు మీదున్నాడని, అతను ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నాడని, 16 నెలలు జైల్లో ఉన్నాడని, అతను ఏపీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని అందరికీ తెలిసేలా చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే జగన్ క్యారెక్టర్ ని వారిలో పలుచన చేశాడు.
ఆ తర్వాత పార్లమెంటులో ఇది కీలక చర్చగా మారడానికి రాజద్రోహం సెక్షన్ తొలగింపు గురించి వివరించాడు.
ఆ తర్వాత జగన్ కేసులు, అతని పాలన, అతని పనుల గురించి ఏపీలో అరాచకాల గురించి అందరు ముఖ్యమంత్రులకు లేఖలు రాసి పరువు తీశాడు.
ఆ తర్వాత గవర్నర్లందరికీ కూడా జగన్ కేసుల గురించి వివరించాడు. తనను ఎలా హింసించిందీ చెప్పాడు. ఈ లేఖల్లో జగన్ పరపతిని డ్యామేజ్ చేయడం ఒక ఉద్దేశం అయితే, ఒక ఎంపీని కొట్టడం ద్వారా ఏపీలో పాలన ఎలా చేస్తున్నాడో అందరికీ తెలియజెప్పడం రఘురామరాజు ఉద్దేశం.
దేశమంతటా జగన్ గురించి అతని కేసుల గురించి చాటింపు వేసి జగన్ ఎవరిని కలిసినా అతని క్యారెక్టర్ గురించి వారు ఆలోచించేలా చేసిన రాజుగారు ఇపుడు ఏపీలో తన గేమ్ మొదలుపెట్టారు.
జగన్ మరిచిపోయిన కీలక హామీలు మీడియాలో చర్చ లేకపోవడం వల్ల జనం మరిచిపోతారు అని జగన్ అనుకున్నారు. ప్రతి రోజు జగన్ మరిచిపోయిన కీలక హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి లేఖ రాయడం ద్వారా ఆయా వర్గాలు ఆ హామీల గురించి, తమకు జగన్ చెప్పిన అబద్ధాల గురించి చర్చించుకునేలా చేస్తున్నాడు. దీంతో వాటిని నెరవేర్చలేక జగన్ పై ఏపీ ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు రాజుగారు.
మొత్తానికి జగన్ చేసిన అతిపెద్ద మిస్టేక్ రాజుగారిని రెచ్చగొట్టడం, అరెస్టు చేయడమేనేమో ! ఈ పాటికి ఇది జగన్ కి కూడా అర్థమై ఉంటుంది.