సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ కౌంటర్‌పై ఎంపీ రఘురామ రీజాయిండర్ వేశారు. వాదనలకు జగన్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం విచారణను జులై 1కి వాయిదా వేసింది.
జగన్ కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలు చేసిన రఘురామ.. కౌంటర్లో జగన్ అసత్యపు ఆరోణలు చేశారని తెలిపారు. తనకు పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పడం అసంబద్ధమని.. పిటిషన్ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టతనిచ్చాయన్నారు.
తనపై కేవలం ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి తప్ప.. ఛార్జిషీట్ నమోదు కాలేదన్నారు. పిటిషన్‌పై విచారణకు.. తన కేసులకు ఎలాంటి సంబంధం లేదని రఘురామ స్పష్టతనిచ్చారు. తనపై అనర్హత వేటుకు.. ఈ పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని రీజాయిండర్ పిటిషన్లో తెలిపారు.
సీబీఐలో కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారని.. అందుకే సీబీఐ ఎలాంటి వైఖరి వెల్లడించడం లేదని రఘురామ అన్నారు. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్ ఎందుకు వేయలేదో అందరికీ తెలుసన్నారు.
ప్రచారం కోసమే తాను పిటిషన్ వేశానన్న ఆరోపణలు నిరాధారమైనవని.. తాను పిటిషన్ వేయగానే ఏపీ సీఐడీ నాపై కేసు నమోదు చేసిందని తెలిపారు. చట్టవిరుద్ధంగా తనను అరెస్ట్ చేసి వేధించారని.. జగన్‌ను వ్యతిరేకించిన వారి గొంతు నొక్కేందుకు కండబలం ప్రదర్శిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని రీజాయిండర్‌లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఎంపీనైన తననే వేధిస్తుంటే జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారి ప్రాణాలకు రక్షణ ఉండదని రఘురామ అన్నారు. జగన్ తన సహ నిందితులు మోపిదేవి వెంకటరమణ, మురళీధర్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, నిమ్మగడ్డ రమేశ్, అరబిందో, హెటిరో సంస్థలకు వివిధ ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేశారు.