144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు వెళ్లేందుకు హిందువులంతా తహతహలాడుతుంటారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం చేసి మూడు సార్లు ముునిగాలని…దీపాలు వదిలి తమ కోరిక నెరవేరాలని కోరుకుంటుంటారు. ఈ క్రమంలొనే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పులివెందుల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవిలు కూడా కుంభమేళాకు వెళ్లారు. కానీ, ఈ ఇద్దరు నేతలు తమ కోసం మొక్కుకోలేదు…రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పులివెందులకు ఉప ఎన్నిక రావాలని మొక్కుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీటెక్ రవి దీపాలు వదులుతుండగా….పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా మొక్కుకో అంటూ రఘురామ చెప్పిన వైనం వైరల్ గా మారింది. అయితే, ఒకవేళ తన కోరిక తీరి పులివెందులకు ఉప ఎన్నిక వస్తే ఇన్ఛార్జ్ గా రఘురామ రావాలని బీటెక్ రవి కోరారు. తప్పకుండా పులివెందులకు ఇన్ఛార్జ్ గా వస్తానని రఘురామ చెప్పారు.
పుణ్య స్నానాలు చేస్తూ కూడా పులివెందుల ఉప ఎన్నిక గురించి ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం విశేషం. అంటే, అసెంబ్లీకి రాని పులివెందుల ఎమ్మెల్యేపై వేటు పడాలని, అప్పుడే బీటెక్ రవి వంటి నేత పోటీ చేసి గెలిస్తే పులివెందుల ప్రజలకు మంచి జరుగుతుందని రఘురామ ఆలోచించిన వైనంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కుంభమేళాలో తమ గురించి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరిద్దరూ మాట్టాడిన మాటలు వైరల్ గా మారాయి.