వైసీపీలో ఉంటూనే పార్టీ, ముఖ్యమంత్రి జగన్, ఇతర నేతలపై తరచూ విమర్శలు చేసే ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజును ఏపీ పోలీసులు కొద్దిసేపటి కిందట అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని ఆయన ఇంట్లోనే ఏపీ సీఐడీ విభాగానికి చెందిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
Ipc 124B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామ కృష్ణంరాజుపై అభియోగాలు నమోదు చేశారు.
కాగా అరెస్ట్ సమయంలో కొంతసేపు హైడ్రామా నడిచింది. ఆయన భద్రతా సిబ్బంది అయిన సీఆర్పీఎఫ్ సిబ్బంది రఘురామ కృష్ణంరాజు చుట్టూ వలయంలా నుల్చుని ఆయన్ను అరెస్ట్ చేయకుండా కాసేపు ప్రతిఘటించారు.
దాంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు.
నిష్కారణంగా మా నాన్నను అరెస్ట్ చేశారు..
‘‘ఈ రోజు మధ్యాహ్నం 3.30కి 30మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి మా నాన్నను బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారు. 4నెలల క్రితం మా నాన్నకు బైపాస్ సర్జరీ జరిగింది
ఓ ఎంపీని 30మంది పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారు. మా నాన్నని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలీదు
మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, పోలీసుల దగ్గర వారెంట్ లేదు’’ అని రఘురామ కృష్ణంరాజు తనయుడు చెప్పారు.
కాగా రఘు రామ కృష్ణంరాజు పుట్టిన రోజు అయిన ఈ రోజునే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఆయన్ను రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
NOTE on arrest of Sri Raghu Rama Krishna Raju
Honourable MP from office of the Addtional DGP CID, AP
Honourable Member of Parliament from Narasapur constituency Sri
Raghu Rama Krishna Raju has been arrested at his residence at
Hyderabad.
There was information against Sri Raju, stating that he has been
indulging in hate speeches against certain communities and
promoting disaffection against the government
A preliminary enquiry has been ordered by ADG CID PV Sunil
Kumar IPS. In the enquiry it was found that through his speeches
on regular basis Mr Raju was indulging in systematic, schematic
effort to cause tensions among the communities and by attacking
various government dignitaries in a way which will cause loss of
faith in the government which they represent.
His speeches and actions to bring into hatred and contempt
against the government of the state by deliberate actions. Series of
attempts have been made to this affect.
There is hate speech against communities and social groups also
which was used to foment social and public order disturbances in
conspiracy with a few media channels
In the backdrop of all these things a case was registered on the
orders of PV Sunil Kumar IPS ADG CID under sections 124A, 153
A, 505 r/w 120 B IPC and an arrest was made