• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జెరూసలేంకు సబ్సిడీ…తిరుమలలో దోపిడీ…ఆర్ఆర్ఆర్ ఫైర్

టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణలో లోపాలపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

admin by admin
August 31, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
279
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని…టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని, వైసీపీ సర్కార్ ను చుట్టుముట్టాయి.

ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపడం, ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. మరోవైపు, టీటీడీకి చెందిన 50 ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో….టీటీడీ ఆస్తుల వేలంపై టీటీడీ ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం, టికెట్ కౌంటర్ల వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నడుచుకుంటోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి నిర్వహణ చేతకాకుంటే వైవీ సుబ్బా‌రెడ్డి, ధర్మా‌రెడ్డి, జవహర్‌రెడ్డి టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సామాన్య ప్రజలు మొదలుకొని పలువురు ప్రముఖుల వరకు ఎందరో ఇచ్చిన వందల కోట్ల విరాళాలతో టీటీడీలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారని, ఆగమ మండలి ఏర్పాటుపై కొంచెం దృష్టి పెట్టాలని అన్నారు. టీటీడీ కల్యాణ మండపాలు అద్దెకిచ్చారని, వాటిలో సువార్త సభలు పెడితే సుబ్బారెడ్డి ఎందుకు ఆపలేదని రఘురామ ప్రశ్నించారు. వెంకన్నపై భక్తితో భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించి, వాటిని ఎవరికో అద్దెకివ్వడం ఏమిటని నిలదీశారు. ధర్మ పరిషత్‌ ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

జెరూసలేం వెళ్లే యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్నారని, కానీ, టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఆర్ఆర్ ఫైర్ అయ్యారు. జెరూసలేంకి ఇచ్చే సబ్సిడీకి తిరుమలలో దోపిడీ ఏమిటని సూటిగా ప్రశ్నించారు. టీటీడీ ఆదాయం కోసం రూమ్‌రెంట్లు పెంచడం సరికాదన్నారు. భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని చెప్పారు.

మద్యంపై జగన్ వేలకోట్లు అప్పులు చేశారని. ఆ రుణమే భవిష్యత్తులో రణమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇంకో 25 వేల కోట్ల రూపాయల రుణాలకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తోందని, ఇంకా ఏపీని అప్పులు ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. ఏపీలో ఇసుక చోరీలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం‌కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన 9మందికి అభినందనలు తెలిపారు.

Tags: ap cm jaganraghurama slams yv subbareddysubsidy for jerusalem tourttd chiarman yv subbareddyttd marriage function hallsycp rebel mp raghuramakrishnaraju
Previous Post

Photos: పోలవరంలో లోకేష్… జనంలో ఇదీ రెస్పాన్స్

Next Post

ఉల్లాసంగా… ఉత్సాహంగా ‘తానా సమ్మర్ క్యాంప్ 2021’సంబరాలు

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post

ఉల్లాసంగా... ఉత్సాహంగా ‘తానా సమ్మర్ క్యాంప్ 2021’సంబరాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra