ఎంపీ, ప్రముఖ తెలుగు రాజకీయ నాయకుడు రఘురామరాజు జగన్ కు ఈరోజు ఊహించని షాక్ ఇచ్చారు. జగన్ ని విమర్శించకుండా కేవలం ఆయన చేస్తున్న తప్పులను మాత్రం ఎత్తిచూపుతూ మార్గదర్శనం చేస్తున్న రఘురామరాజుని జగన్ అభిమానులు ఎదుర్కోలేకపోయారు. దీంతో వారు ఆయనను తరచూ బూతులు తిట్టడం మొదలుపెట్టారు.
ముఖ్యమంత్రి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని సరిదిద్దే నన్ను మీరు టార్గెట్ చేస్తారా అని పలుమార్లు రఘురామరాజు హెచ్చరించారు. అయినా వారు మారలేదు. నెటిజన్ భాషలో చెప్పాలంటే పేటీఎం బ్యాచ్ మారలేదు.
పైగా జగన్ కూడా ఇందులో దూరి ఎపుడో మురిగిపోయిన ఒక వ్యవహారంలో రాజుపై సీబీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి రఘురామరాజు వైసీపీ నేతల్లా తప్పించుకోకుండా సహకరించారు.
అయితే, బెయిలు మీద బయట ఉంటూ జగన్ బెయిలు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా కోట్ల మంది ప్రజలకు నష్టం చేసే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం, నిందితులకు దొంగలకు సహకరించడంతో రఘురామరాజుకు కాలింది.
దీంతో జగన్ బెయిల్ నిబందనలు ఉల్లంఘిస్తున్నారు అంటూ సీబీఐ కోర్టులో పిటిషను వేశారు. ఆ పిటిషను తొలుత కోర్టు తిప్పి పంపి మరిన్ని వివరాలు అడిగింది. అయితే, పిటిషను కొట్టేసింది అంటూ జగన్ అభిమానులు తమకు అలవాటైన అబద్ధపు ప్రచారం చేశారు.
అయితే, కోర్టు అడిగిన వివరాలు రఘురామరాజు కోర్టుకు సమర్పించడంతో ఆ పిటిషను ఈరోజు విచారించి… రఘురామరాజు వేసిన పిటిషనుకు విచారణ అర్హత ఉందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే జగన్ బెయిలు ఏ క్షణమైన రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెబుతూ రఘురామరాజు జగన్ అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ’’ఒరే వెధవల్లారా… మళ్లీ ఇంకోసారి చెబుతున్నాను. కంట్రోల్ యువర్ టంగ్. అదుపులో పెట్టుకోండి. మీలాంటి వెధవలు నోరు అదుపులో పెట్టుకోకపోతే దాని ప్రభావం ముఖ్యమంత్రిపై పడుతుంది. ఎందుకంటే మీ చెత్తనాకొడుకులు అందరికీ నేను సమాధానం ఇవ్వను. మీరు నన్ను ఏదైనా అంటే… నేను మీ మా జగన్ ని కెలుకుతా? మీరు నాపై వాగితే వాచిపోయేది జగన్ కే‘‘ అంటూ హెచ్చరించారు.
ఇది కింది వీడియోల 3.40 నిమిషాల నుంచి మీరే వినొచ్చు.
.
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) April 27, 2021