సామాన్యులైనా…సెలబ్రిటీలైనా…పొలిటిషియన్లైనా…పొలిటికల్ అడ్వైజర్లయినా….తెలిసో తెలియకో ఒక సారి చేస్తే అది పొరపాటు అనుకోవచ్చు…కానీ, తెలిసి కూడా అదే పొరపాటును మళ్లీ మళ్లీ చేస్తే అది తప్పు అవుతుంది. అధికారంలో ఉన్నాం కదా అని ఆ తప్పులను రాజకీయ నాయకులు చేసుకుంటూ పోతే…చట్టం చేతికి చిక్కి న్యాయస్థానాలతో చీవాట్లు తినాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ చేసిన ఇలాంటి తప్పు ఒకటి తీవ్ర చర్చనీయాంశమైంది.
పీఏసీ చైౖర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకం వయోపరిమితి నిబంధనకు విరుద్ధంగా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ లేఖ రాశారు. జస్టిస్ కనగరాజ్ నియామకం ఆమోదయోగ్యం కాదని, తక్షణమే తన చౌకబారు నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకోవాలని రఘురామ కోరారు. చట్టం నిర్దేశించిన వయోపరిమితిని అతిక్రమించి వయోవృద్ధుడైన జస్టిస్ కనగరాజ్‌ను అక్రమ పద్ధతిలో నియమించుకోవడం తనను ఆందోళనకు గురి చేసిందని అన్నారు.
జస్టిస్ కనగరాజ్లో అద్భుతమైన న్యాయశాస్త్ర ప్రతిభ దాగి ఉందని జగన్ భావిస్తే… ఆయనను తన న్యాయ సలహాదారుగా నియమించుకోవాలని రఘురామ సూచించారు. పెండింగ్‌లో ఉన్న తన కేసుల పరిష్కారానికి జస్టిస్ కనగరాజ్ ను జగన్ ఉపయోగించుకోవాలని సూచించారు. పీసీఏ వంటి సంస్థలను న్యాయపరమైన చిక్కులోకి నెట్టకుండా ఉండాలని, జస్టిస్ కనగరాజ్ నియామకం నిర్ణయంపై పునరాలోచన చేసి వెనక్కి తీసుకోవాలని అన్నారు.