వరద బాధితులను వెళ్లి కలవని సీఎం రాష్ట్రమంతటా కోడై కూస్తే తప్పదంటావా అంటూ జగనన్న హెలికాప్టర్లో బయలుదేరాడు.
అయితే, జనం ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకుని తీవ్ర వేదనలో ఉన్నపుడు జగన్ తన అనుచరలతో చోపర్ లో వెళ్తూ దిగిన సెల్ఫీని పోస్టు చేస్తూ రఘురామరాజు జగన్ ని ర్యాగింగ్ చేశాడు.
వరద బాధితులను ఓదార్చేందుకు నా ప్రియమైన ముఖ్యమంత్రి మరియు ఆయన బృందం ఈరోజు హెలికాప్టర్లో బయలుదేరింది. వారి ముఖకవళికలకు, వెళ్తున్న సందర్భానికి అతుకుతోందా? ఇది వేడుకనా? ఏమో మరి! మీరు నిర్ణయించుకోండి. అంటూ రఘురామరాజు వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
My beloved CM and his team in the chopper today on their way to console the flood victims. Is their expression matching the occasion? Is it a celebration? ఏమో మరి! You decide.???? pic.twitter.com/ItrcfCPZCH
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) December 2, 2021
మరో వైపు వరద బాధితుల వద్దకు వెళ్లిన జగన్… వారికున్న కోపానికి తనపై దాడి చేస్తారు అనుకున్నారో ఏమో…. భారీగా రోప్ పార్టీతో బాధితులకు దూరంగా ఉండి భారీ సెక్యూరిటీ మధ్య వాళ్లని పలకరించాడు. జగన్ కష్టాలు చూస్తుంటే పాపం గతంలో ఏ సీఎం కూడా ఇలాంటి పరిస్థితి అనుభవించి ఉండడు.
ఇది నిజమో కాదో ఈ ఫొటో చూసి మీరే చెప్పండి.
దీన్ని ఓదార్పు అంటారా ? బాధితులు అంత దూరంగా ఉండాలా ? భయమా ? దీని కంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండటమే నయం. pic.twitter.com/eIKps2fGCP
— Telugu Desam Party (@JaiTDP) December 2, 2021