నిన్నటి నుంచి ఏపీ సీఎం జగన్ కి హోం మంత్రి క్లాస్ పీకినట్లు మీడియాలో హోరెత్తి పోతోంది. తొలుత ఇది ఏబీఎన్ లో ప్రసారమైంది. ఆ తర్వాత అన్ని మీడియాల్లో ప్రసారమైంది. దీనిని ఎలా ఖండించాలో తెలియక వైసీపీ కేడర్ ఆపసోపాలు పడింది. రాధాకృష్ణ సోఫా వెనక దాక్కున్నారా? అక్కడేం జరిగిందో ఆయనకెలా తెలుస్తుంది. అంటూ విచిత్రమైన బూతు భాష అంతా వాడారు. ఏబీఎన్ చెప్పిన అదే బ్రేకింగ్ లో పొద్దున వచ్చి మళ్లీ అమిత్ షా కలవమన్నారు అని కూడా చెప్పారు. ఇది కూడా ఏబీఎన్ మాత్రమే చెప్పింది. మరి ఏబీఎన్ చెప్పినట్లే జగన్ ఈ పొద్దున వెళ్లి మళ్లీ అమిత్ షాను కలిశారు జగన్.
ఇక్కడ పాయింట్ ఏంటంటే… ఉదయం కలుస్తాడని ఏబీఎన్ చెప్పేదాక ఎవరికీ తెలియదు. పార్టీలో వారికి కూడా తెలియదు. మరి అది కూడా అమిత్ షా చెప్పిన విషయమే కదా. అమిత్ షా చెప్పిన ఆ విషయం ఉదయం నిజమైంది కదా. అమిత్ షా పొద్దున రమ్మని జగన్ కి చెప్పిన విషయం వెంటనే తెలిసిన ఏబీఎన్ కి సీఎంకి క్లాస్ పీకిన విషయం తెలియకుండా ఉంటుందా?
ఇది కూడా నమ్మశక్యం కాకపోతే నర్సాపురం ఎంపీ రఘురామరాజు మరో సూపర్ హింట్ ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఫొటో కూడా బయటకు రాలేదు. గమనించారా అని గుర్తుచేశారు రఘురామరాజు. ఎపుడో పాత ఫొటోలు వాడారు. కేవలం ఒక బొకే ఫొటో వచ్చింది. సాధారణంగా గుట్టలుగుట్టలుగా పొటోలొచ్చేవి. ఇదంతా ఎందుకు… అక్కడేం జరిగిందో…. హోంమంత్రితో ఆర్థిక చర్చలు జరిగాయని ప్రకటించినపుడన్నా అర్థం చేసుకోవాలి కదయ్యా అన్నీ నన్నడుగుతారు అంటూ తనదైన శైలిలో సెటైర్ వేశారు రఘురామరాజు.