వైసీపీ నేలనుద్దేశించి టీడీపీ నేత పట్టాభి అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే ఆవేశంతో పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని సాక్ష్యాత్తూ సీఎం జగన్ సమర్థింపు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పట్టాభి దూషణలు చాలా దారుణంగా ఉన్నాయని, ఇంతవరకు అలాంటి భాష వినలేదని వైసీపీ నేతలతోపాటు ఏపీ డీజీపీ సవాంగ్ కూడా చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు బూతుగా భావిస్తున్న బోసడీకే పదంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన రీతిలో స్పందించారు.
‘బోసడీకే’ పదానికి అర్థం వెతికిన రఘురామ…ఆ పదం అసలు తిట్టు కాదని రఘురామ తేల్చేశారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్లో ఉందని రఘురామ వెల్లడించారు. పట్టాభి అన్న ఈ పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలని తన స్నేహితులు చాలామందిని ఆరా తీశానని, వైసీపీలోని తన అజ్ఞాత స్నేహితులను కూడా అడిగానని అన్నారు. ఆ పదానికి అర్థం తమకు తెలీదని, అదేమన్నా బూతు పదమేమోనని వారు చెప్పారని రఘురామ అన్నారు.
అపుడు తాను గూగుల్ లో ఆ పదం అర్థం కోసం వెతికానని, ‘సర్.. మీరు బాగున్నారా’ అనడం కోసం సంస్కృతంలో బోసడీకే అంటారని రఘురామ వివరించారు. మరి, ఈ పదానికి అర్థం వైసీపీ నేతలకు బోధపడుతుందో లేదో చూడాలి మరి. కాగా, గతంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబును నడిరోడ్డు మీద కాల్చిపడేయాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే…ఈ వ్యాఖ్యలు పెద్దవేమీ కావని సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ ను ఏకిపడేస్తున్నారు. బూతుల మంత్రి కొడాలి నాని, మంత్రి అనిల్ కుమార్ లతో పోలిస్తే ఇవి చాలా బెటరని అంటున్నారు.