వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణ రాజు పార్లమెంటు టికెట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనకు టికెట్ ఉందా? లేదా ? ఎవరిస్తారు? ఏ పార్టీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు? అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. వీటికి సమాధానం దొరకడం లేదు. ఏలూరులో నిర్వహించిన తెలుగు జన కేతన విజయ జెండా సభలో మాట్లాడిన రఘురామ.. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ-జనసేనకూటమి పక్షాన పోటీ చేస్తున్నానని ప్రకటించారు. అది కూడా నరసాపురం నుంచే మరోసారి బరిలో దిగుతున్నట్టు చెప్పా రు. అయితే.. దీనికి సంబంధించి అటుటీడీపీ, ఇటు జనసేనలు స్పందించలేదు. తాము ఆయనను పార్టీలో చేర్చుకుంటున్నామని ప్రకటించలేదు.
ఇక, బీజేపీ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల మధ్య సీట్లు ఖరారయ్యారు. పార్లమెంటు కు సంబంధించి బీజేపీ 6 స్థానాలు దక్కించుకుంది. సంప్రదాయంగా బీజేపీకి నరసాపురం టికెట్‌ను కేటాయిస్తున్నారు. సో.. ఆ ప్రకారం నరసాపురం టికెట్ బీజేపీకి దక్కే అవకాశం ఉంది. అయితే.. ఆ పార్టీలోనే ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నేరుగా ప్రధాని మోడీ వంటివారితో సత్సంబంధాలుకలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేస్తానని కనుక ముందుకు వస్తే.. బీజేపీ గోకరాజువైపు మొగ్గు చూపే అవకాశం మెండుగా ఉంది. పైగా ఆయనపై ఎలాంటి వివాదాలు లేకపోవడం, ఆర్ ఎస్ ఎస్తోనూ సంబంధాలు ఉండడం గమనార్హం.
ఇక, రఘురామ విషయంలో మరోవివాదం తెరమీదికి వచ్చింది. తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అదిష్టానానికి కబురు పెట్టినట్టు ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. విష్ణు వెనుక సీఎం జగన్ ఉన్నారని.. ఆయనే తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో తనకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
“జగన్ ఎందుకు భయపడుతున్నాడో తెలియడం లేదు. నాకు సీటు ఇస్తే జగన్‌కు వచ్చిన నష్టం ఏంటి? విష్ణు వర్ధన్ రెడ్డిది కదిరి ప్రాంతం. ఆయనకు నరసాపురం గురించి ఎందుకు? ఒకవేళ నాకు కాదంటే.. ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేస్తాడా? నాపేరు కన్ఫామ్ అయిపోతే వారికి భయం ఎందుకు? నాకు టికెట్ ఇవ్వొద్దు అనే దాని వెనుక కుట్ర ఉంది. వారు ఎన్ని కుట్రలు చేసినా.. నాకు టికెట్ వస్తుంది“ అని రఘురామ అన్నారు. కానీ, రఘురామ ఇంత ధీమా గా చెబుతున్నా.. బీజేపీలో క్షేత్రస్థాయి పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. గోకరాజు వంటి బలమైన ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కనుక తెరమీదికి వస్తే.. రఘురామకు ఇబ్బంది తప్పేలా లేదని అంటున్నారు పరిశీలకులు. ఇక, అప్పుడు టీడీపీనే ఆయనను వేరే చోట సీటు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఛాన్స్ తీసుకోవద్దు ..!
రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు#TV5Sambasivarao #TopStory#RaghuRamaKrishnamRaju#ChandrababuNaidu #TDP#pavankalyan #Janasena#Modi #amithsha #BJP4IND#CMJagan #YCP#APPolitics #apelections2024#TV5 #TV5News pic.twitter.com/8XRxbZBkSH— TV5 News (@tv5newsnow) March 12, 2024
50 సంవత్సారాలు వచ్చినా మీసాలు రాలేదు.. అనుకున్నారా? ఒరిజినల్… రాజు .. రఘు రామ కృష్ణం రాజు…????????????????
ఎవర్ని మీసాలు లేనొడు అంటున్నాడు ????????#TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/UNNudXbVSi
— sivazee (@sivazeestudio) March 6, 2024