మంచో.. చెడో.. ఏదైనా కానీ.. రాజకీయాల్లో కొందరు ఒక బ్రాండ్ వేసుకుంటారు. ఇలానే.. గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు.. మాజీ మంత్రి కొడాలి నానికి ఒక బ్రాండ్ ఉంది. ఆయన నోరు విప్పితే.. మాటల తూటా లు పేలుతాయని.. ఫైర్‌బ్రాండ్ అని అంటారు. ఇక, ఇప్పుడు ఆయనను మించిపోయినట్టుగా వ్యవహరిం చారు టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ చీఫ్ బుద్దా వెంకన్న.
తాజాగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని సహా.. టీడీపీ నుంచి బయటకు వస్తానని ప్రకటించిన ఎంపీ కేశినేని నానిలపై నిప్పులు చెరిగారు. “కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క. రేబీస్ ఇంజెక్షన్లు పంపిస్తా. వైసీపీ నాయకులు వెంటనే ఆయనకు ఈ ఇంజన్లు చేయించాలి“ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెబీస్ ఇంజన్లు గతంలోనే చేయిస్తే.. బాగుండేదని కూడా అన్నారు.
ఈ నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో పర్యటిస్తున్నట్టు బుద్దా వెంకన్న చెప్పారు. అదేసమయంలో రా.. కదలిరా! సభ పెడుతున్నామన్నారు. దీంతో కొడాలికి పిచ్చెక్కిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేదో మాట్లాడుతున్నాడని.. ఏం చేస్తాడో అనే భయంతో ఎవరికీ ఎలాంటి ముప్పూ రాకూడదన్న ఆలోచనతో తానే స్వయంగారెబీస్ ఇంజన్లు కొన్నానని బుద్దా వ్యాఖ్యానించారు.
తన సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడకు పంపిస్తున్నట్టు బుద్దా వ్యాఖ్యానించారు. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు ఆయనకు చేయించాలని వైసీపీ నాయకులకు సూచిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 18న గుడివాడలో పర్యటిస్తున్న చంద్రబాబుపై కొడాలి నోరు పారేసుకుంటే రెండు కాళ్ళూ విరగొట్టి పోయ్యిలో పెడతానని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ ఎంపీ కేశినేనిది కాదని బుద్దా వ్యాఖ్యానించారు.