టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రాశీ ఖన్నా ఒకరు. కెరీర్ ఆరంభంలోకాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో పూర్తిగా స్లిమ్ కావటం.. తన రూపాన్ని మార్చుకొని అందరికిషాక్ ఇచ్చిన ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు.
తాజాగా ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటివేళ సోషల్ మీడియాలో అభిమానులతో తన ఇష్టాయిష్టాలనను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె నోటి నుంచి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
తన ఫోన్ వాల్ పిక్ గా తన గురువుగారితో దిగిన ఫోటో పెట్టుకున్నట్లు చెప్పిన ఆమె.. తన జీవితంలోకి ఇంకా బాయ్ ఫ్రెండ్ అనే మెటీరియల్ రాలేదని.. ఒకవేళ తాను ఎవరినైనా ఇష్టపడితే మాత్రం షేర్ చేసుకుంటానని వెల్లడించారు. అందుకు మరికొంత కాలం వెయిట్ చేయాలన్నారు.
తాను ఫుడీని కాదని.. పూర్తిగా శాఖాహారినని చెప్పారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసన్న రాశీ.. తనకు థాయ్ గ్రీన్ కర్రీ.. ఛోలే బటురే..సమోసా ఇష్టమన్నారు.
కోలీవుడ్ లో విజయ్.. నయనతార.. మాలీవుడ్ లో ఫహద్ ఫాజిల్ ఇష్టమని.. టాలీవుడ్ లో సమంత.. అనుష్క.. జూనియర్ ఎన్టీఆర్.. బన్నీ.. మహేశ్ బాబు అంటే ఇష్టమని చెప్పింది. వెంకటేశ్ చాలా ఇష్టమని.. చాలా బాగా మాట్లాడతారని పేర్కొంది. ఇట్టే కలిసిపోతారని.. ఆయనతో కలిసి పని చేయటాన్ని ఎంతో మిస్ అవుతున్నట్లు చెప్పారు.
ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నానో తనకు తెలీదన్న ఆమె.. తన మీద వచ్చే రూమర్స్ ను అస్సలు నమ్మొద్దని.. తాను చెప్పే వరకు ఏ విషయాన్ని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
హాలీడేస్ అంటే మాత్రం లండన్ ను ఎక్కువగా ఇష్టపడతానన్న ఆమె.. తన మదర్ టంగ్ గురించి చెబుతూ హిందీగా పేర్కొన్నారు. మొత్తంగా తనకు ఐదు భాషలు వచ్చని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.