‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా…మావా…ఊ అంటావా మావా’ అనే ఐటెం సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది.
ఊహించిన దానికంటే ఘనంగా ఉందీ పాట. ఐటెం గర్ల్ గా సమంత అన్నపుడే ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది.
ఇక సమంత స్పైసీ లుక్ కు తగ్గట్టు… టెంప్టింగ్ లిరిక్స్, ఆకట్టుకునే ట్యూన్తో పాటపై, సినిమాపై మరింత హైప్ వచ్చింది.
చంద్రబోస్ సాహిత్యానికి ఇంద్రావతి చౌహాన్ హస్కీగా పాడిన ఈ పాట అదిరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్తో ‘పుష్ప’ వంటి సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ లో తగ్గట్టు… ఐటెమ్ నంబర్ సెట్ అయ్యింది.
డిసెంబర్ 17న సినిమా విడుదల కావడానికి మరో వారం మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో Puspha టీం ఈ పాటతో ప్రమోషన్ ను దుమ్మురేపుతోంది.
RRR ట్రైలర్ తర్వాత పుష్పకి కాస్త హైప్ తగ్గిన మాట నిజమే. కానీ ఈ పాటతో మళ్లీ పుష్ప పైకి లేచింది.
అల్లు అర్జున్ యొక్క భారీ-బడ్జెట్ చిత్రంలో అన్ని దక్షిణాది పరిశ్రమల నుండి ఎంపిక చేసిన నటీనటులు ఇందులో ఉన్నారు. సునీల్ మరియు అనసూయ మొదటి సారి ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ప్లే చేయనున్నారు.
“తాను మరియు ఆమె తల్లిదండ్రులు గర్వించే పాత్రలను మాత్రమే ఎంచుకుంటాను” అని చెప్పిన సమంత ఐటెం సాంగ్ చేయడంపై కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.
కానీ చూస్తుంటే ఈ ఐటెం సాంగ్ ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యేలా ఉంది.
ఈ పాటలో ఎంత కిక్కుందంటే… అల్లు అర్జున్ రాబోయే ‘పుష్ప’కి కూడా పెద్ద ప్రమోషనల్ బూస్ట్ అవుతుంది.