ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కోసం రూ. 40 లక్షలు ఖర్చు పెట్టారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప ది రైస్ మూవీతో నేషనల్ వైడ్ గా భారీ పాపులరిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పుష్ప 2 సెట్స్ మీద ఉండగా ఇటీవల అల్లు అర్జున్ తన గడ్డాన్ని ట్రిమ్ చేయడం అనేక చర్చలకు దారి తీసింది.
సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయని.. పుష్ప 2 మూవీ షూటింగ్ ఆగిపోయిందని.. అందుకే అల్లు అర్జున్ గడ్డం తీసేసాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి నిర్మాత బన్నీ వాసు చెక్ పెట్టారు. షూటింగ్ కు నెల రోజులు గ్యాప్ రావడం వల్ల వెకేషన్ కు వెళ్లడం కోసం లెక్కలేసుకుని మరీ అల్లు అర్జున్ తన గడ్డాన్ని తీశారని బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు నెల రోజులు గ్యాప్ కాస్తా తగ్గిపోయి అనుకున్న దానికంటే ముందుగానే పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయింది. కానీ అల్లు అర్జున్ గడ్డం మాత్రం పెరగలేదు. ఇక సినిమా వాళ్లకి పెట్టుడు గడ్డాలు, మీసాలు, విగ్గులు కొత్తేమి కాదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా టెంపరరీ గడ్డం వైపు మొగ్గు చూపారు. దీంతో న్యాచురల్ లుక్ రావడానికి చిత్ర బృందం గట్టిగానే కష్టపడింది. ముంబై నుంచి ఒక స్పెషలిస్ట్ ను దింపి.. అతని చేత అల్లు అర్జున్ కోసం పెట్టుడు గడ్డం సెట్ చేయించారట. ఆ గడ్డం ఖరీదు అక్షరాల రూ. 40 లక్షలు అని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.