టాలీవుడ్ విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ తీసే సినిమాల గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలు, అందులో ఆయన రాసే డైలాగులు విలక్షణంగా, ముక్కుసూటిగా ఉంటాయి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా పూరీ తాను చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు. ఈ క్రమంలోనే తనకు ఛార్మితో ఎఫైర్ ఉందన్న పుకార్లపై పూరీ తనదైన రీతిలో స్పందించాడు. తాజాగా లైగర్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ ఆ పుకార్లపై తొలిసారిగా స్పందించాడు
ఛార్మి తనకు 13 ఏళ్ల వయసు నుండి తెలుసని, ఆమెతో చాలాకాలం నుంచి పరిచయం ఉందని చెప్పాడు. తాను, చార్మి కలిసి పూరి కనెక్ట్ పేరుతో నిర్మాణ సంస్థ మొదలు పెట్టామని, ఇద్దరు కలిసి సినిమాలు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చాడు. చార్మి తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని, తమ ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని కుండ బద్దలు కొట్టాడు. అంతేకాదు, అట్రాక్షన్ అనేది ఎక్కువకాలం ఉండదని, తాము మంచి మిత్రులం కాబట్టే ఇన్నేళ్లుగా కలిసి ఉంటున్నామని అంటున్నాడు పూరి.
ఇక, ఛార్మి వయసులో ఉంది కాబట్టి ఆమెతో తనకి ఎఫైర్ ఉందని గాసిప్స్ వస్తున్నాయని, అదే ఛార్మికి 50 ఏళ్ల వయసు ఉంటే ఇలాంటి పుకార్లు వచ్చి ఉండేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే, చార్మి, పూరీలు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని, కలిసే సినిమా షూటింగ్లకు టూర్లకు వెళుతుంటారు అని తెలిసిందే. ఇంకా, చెప్పాలంటే పూరీ ఎక్కడ ఉంటే ఛార్మి అక్కడుంటుంది. దీంతో, ఛార్మి వల్ల పూరీ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ప్రస్తావించాడు. తన కుటుంబాన్ని పూరీ పట్టించుకోవడం లేదన్నట్లుగా బండ్ల మాట్లాడాడు. తన కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేనంత బిజీగా పూరీ ఉన్నాడా అని బండ్ల ప్రశ్నించడం సంచలనం చేపింది. మరోవైపు, ఛార్మిపై లావణ్య ఒకటి రెండు సార్లు దాడికి కూడా తెగబడిందని పుకార్లు వినిపించాయి. కానీ, పూరీ మాత్రం తాము ఫ్రెండ్స్ అని, తాము కలిసే ఉంటామని చెబుతున్నాడు. తాజాగా పూరీ ఇచ్చిన క్లారిటీతోనైనా ఆ పుకార్లకు చెక్ పడుతుందేమో వేచి చూడాలి.