తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్, నటి ఛార్మిని ఈడీ అధికారులు సుమారు 12 గంటల పాటు విచారించారు. ఇటీవల విడుదలైన లైగర్ చిత్రానికి సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియో గాలపై ఇద్దరికీ వారం క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో పూరి జగన్నాథ్, ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 12 గంటల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విడుదలైన లైగర్ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది.
ఇదిలావుంటే.. లైగర్ మూవీ ఫెయిల్యూర్ అయిన విషయం తెలిసిందే. దీనిలో బాహుబలి మైక్ టైసన్ కీలక రోల్పోషించారు. ఎక్కువ భాగం విదేశాల్లోనూ షూట్ చేసుకున్న ఈ మూవీ ఆశించినంతగా అయితే.. కలెక్ష న్స్ రాబట్టలేకపోయింది. అంతేకాదు.. ఎక్కువ రోజులు కూడా ఆడలేదు. ఇదిలావుంటే.. ఈ సినిమాకు రాజకీయ నేత ఒకరు డబ్బులు సర్దారనే చర్చ అప్పట్లోనే సాగింది. ఇక, ఇప్పుడు ఈడీ కూడా ఇదే విషయాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది.