భోపాల్ గ్యాస్‌లీకేజీ ఘటన తెలిసిందే. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటిదే.. తాజాగా పంజాబ్‌లో జరిగింది. అయితే.. అంత తీవ్రత లేకపోయినా.. ఇక్కడ కూడా 11 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని ఆర్థిక నగరం లుధియానాలో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీకైన ప్రదేశం నుంచి 300 మీటర్ల పరిధిలో ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు.
కొందరు ఇళ్లలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన లుధియానాలోని గియాస్పుర్ ప్రాంతంలో జరిగింది. అసలు లీకైన గ్యాస్ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్యాస్ లీక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్ఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని సీల్ చేసి.. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.
మ్యాన్‌హోల్స్‌లో మీథేన్‌లో ఏదో రసాయనం కలసి ఉండొచ్చని.. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాతోందని వెల్లడించారు. అంతకుముందు.. డెయిరీ ప్లాంట్ నుంచి గ్యాస్ లీకైందని అంతా అనుకున్నారు.
లూధియానా గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించిన వారికి పంజాబ్ ప్రభుత్వం 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి.. అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
A gas leak has killed 11 people,including children,in Ludhiana in the northern Indian state of Punjab.pic.twitter.com/Uu0rHZYP6f
— NCMOULY99 (@moulync) April 30, 2023