• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన కోసం టీడీపీ ‘మాటా మంతి’

admin by admin
November 15, 2022
in Politics, Top Stories
0
0
SHARES
176
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాష్ట్రంలో ‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘మాటామంతి’ కార్యక్రమం పోస్టర్ ను అనిత, తెలుగు మహిళ విభాగం నేతలు, టీడీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే జగన్ పై అనిత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ ను నమ్మి ఓటేసి మహిళా వర్గం మోసపోయిందని, జగన్ ధన దాహానికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేతగా మద్యపాన నిషేధం చేపడతానని ప్రగల్భాలు పలికిన జగన్…మహిళలను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. అమ్మఒడి, ఆసరా, 45 సంవత్సరాలకే పెన్షన్ చూసి జగన్ కు మహిళలు ఓట్లు వేయలేదని, కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెబితేనే ఓట్లేశారని విమర్శించారు.మహిళలను టార్గెట్ చేసి జగన్ హింసిస్తున్నారని, పూటకో అత్యాచారం జరుగుతుంటే దిశ చట్టం ఏమైందని నిలదీశారు.

మహిళా కమిషన్ కు అత్యాచారాలు, హత్యల వివరాల బుక్ ఇచ్చామని, అయినా చలనం లేదని విమర్శించారు. జగన్ ను, ఆయన సతీమణిని ఏమన్నా అంటే మహిళా కమిషన్ స్పందిస్తుందని, కానీ, అత్యాచారాలపై మాత్రం స్పందించదని విమర్శించారు.
మద్య నిషేధం అని చెప్పిన వైసీపీ నేతలు ఎన్ని బేవరేజెస్ లను, ఎన్ని డిస్టలరీలను మూయించారో చెప్పాలని నిలదీశారు.

కరోనా మరణాల కంటే కల్తీ మద్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగాయని, జగన్ కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం ఎక్కువ అని విమర్శించారు. జగన్ పాలనపై గ్రామ గ్రామానికి వెళ్లి ‘మాటామంతి’ కార్యక్రమం ద్వారా మహిళలను చైతన్యపరుస్తామని చెప్పారు.

Tags: cycle rulingJaganmata manthi programpsycho rulingtdp leader vangalapudi anitha
Previous Post

మహేష్ బాబు కష్టం..పగోడికి కూడా రాకూడదు

Next Post

`మార్గ‌ద‌ర్శి` దాడులు.. ఏపీలో క‌ల‌క‌లం!

Related Posts

Trending

ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి

June 6, 2023
Trending

సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?

June 6, 2023
Trending

షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్

June 6, 2023
Trending

తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!

June 5, 2023
Top Stories

ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్

June 5, 2023
Top Stories

వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్

June 5, 2023
Load More
Next Post
ramoji and jagan

`మార్గ‌ద‌ర్శి` దాడులు.. ఏపీలో క‌ల‌క‌లం!

Latest News

  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra