వేశ్యావృత్తిన్ని సుప్రింకోర్టు చట్టబద్దమైనదిగా గుర్తించేసింది. ఇంతకాలం వేశ్యలతో గడుపుతున్న వారిని, వేశ్యలను పోలీసులు పట్టుకుని కేసులు నమోదుచేసేవారు. ఆమధ్య వేశ్యలతో గడుపుతున్న విటులను పట్టుకునేందుకు లేదని కేరళ హైకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. దాంతో విటులను పోలీసులు పట్టుకునేందుకు లేదన్నపుడు వేశ్యలను మాత్రం ఎలా పట్టుకుంటారనే చర్చ దేశంలో మొదలైంది.
ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రింకోర్టు చివరకు వేశ్యావృత్తి తప్పుకాదని తేల్చేసింది. వేశ్యా వృత్తికి వందల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయాన్ని గుర్తుచేసింది. ఇష్టపడి వేశ్యావృత్తిలోకి దిగిన మహిళలను పట్టుకోవటం, వేధించటం పోలీసులకు తగదని స్పష్టంగా ఆదేశించింది.
ఇదే సమయంలో మహిళలను బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపుతున్న వాళ్ళది మాత్రం తప్పే అని తేల్చింది. వేశ్యా గృహాలు నడపటం తప్పే అని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది.
సింపుల్ గా చెప్పాలంటే…. ఎవరికి వాళ్లు వేశ్యలుగా మారొచ్చు గాని దానిని ఆర్గనైజ్డ్ గా చేయడం మాత్రమే నేరం అన్నమాట.
సుప్రింకోర్టు తాజా తీర్పుతో ఇటు వేశ్యలకు అటు విటులకు ఇద్దరికీ పోలీసుల నుండి వేధింపులు తప్పినట్లయ్యింది. ఇతర వృత్తులు ఎలాంటివో వేశ్యావృత్తి కూడా అలాంటిదే అని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. ఇతర వృత్తుల్లోని వారికున్న చట్టబద్దమైన అన్నీ రక్షణలు వేశ్యావృత్తిలోకి వారికి కూడా ఉంటాయని స్పష్టంగా ఆదేశించింది. సెక్స్ వర్కర్ మేజర్ అయ్యుండి, తమిష్టప్రకారమే వృత్తిలోకి ప్రవేశించిన వారి విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని కోర్టు చెప్పింది.
అలాగే బ్రోతల్ హౌస్ లో ఇష్టపూర్వకంగా జరిగే సెక్స్ చట్టవిరుద్ధమేమీ కాదన్నది. బ్రోతల్ హౌస్ పై దాడులు చేసే పోలీసులు వారిని వేధించటం, అరెస్టులు చేస్తామని బెదిరించటం, పోలీసుస్టేషన్ కు తరలించాల్సిన అవసరంలేదన్నారు. అసలు తమకు ఏదైనా ఫిర్యాదు అందితేకానీ బ్రోతల్ హౌస్ పై పోలీసులు దాడులు చేసేందుకు లేదని కూడా తేల్చిచెప్పేసింది.
సెక్స్ వర్కర్ బిడ్డను ఎవరు వేరుచేయకూడదని సుప్రింకోర్టు చెప్పింది. బ్రోతల్ హౌస్ లో దొరికిన మైనర్లను అక్రమరవాణాగా తీసుకొచ్చారని అనుమానించేందుకు లేదని కోర్టు గట్టిగా చెప్పింది. తమపై దాడి జరిగిందని సెక్స్ వర్కర్ ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు స్సందించాలని ఆదేశించింది.