• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ నేత‌ల‌పై నిర్మాత త‌మ్మారెడ్డి ఫైర్‌

admin by admin
January 12, 2022
in Movies, Trending
0
tammareddy bharadwaja
0
SHARES
170
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ ప్ర‌భుత్వానికి, సినిమా ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య రాజుకున్న వివాదం ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రు ఆర్టిస్టులు మాత్ర‌మే స్పందిస్తే.. ఇప్పుడు తాజాగా ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కులు.. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమేనని తేల్చి చెప్పారు.

సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ త‌మ్మారెడ్డి నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత? అంటూ సూటిగా ప్రశ్నించారు. రూ.కోట్లు పెట్టి నాయకులను ఎన్నుకుంటున్నామన్న ఆయన.. వాళ్లు మాత్రం రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారంటూ విమర్శించారు. సినీ పరిశ్రమ అంటే నిర్మాతల మండలని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దని హెచ్చ‌రించారు.

“సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలి. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమే. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు?. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?. మీరు వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?. మేము రూ.కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు ఏరుకుంటున్నాం. మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దు“ అని భ‌ర‌ద్వాజ పేర్కొన్నారు.

‘‘సినిమా వాళ్లంటే చీప్‌గా దొరికారని బలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరు బలిశారు సర్?.. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు?.. మీ చరిత్రలేంటి?.. వాటి గురించి మాట్లాడదామా?.. ఓపెన్ డిబేట్‌కు వస్తారా ఎవరైనా?.. దమ్ముందా?.. ఎవరిని మెప్పించడానికి మీరు బలుపులు, కులాల గురించి మాట్లాడుతున్నారు? మీరంతా రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత… వచ్చాక ఎంత?.. మీ పార్టీలోని చోటా మోటా నాయకుల ఆస్తులు తీయండి.. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం రండి. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా?.. దమ్ముంటే రండి.. ఓపెన్ ఛాలెంజ్. అని వ్యాఖ్యానించారు.

మేము కష్టపడి సంపాదిస్తున్నాం. సినిమాను తయారు చేస్తున్నాం. మా కళలను అమ్ముతున్నాం. ఒక సినిమాకు 200 మందిపైనే కష్టపడతారు. మేము కోట్లు కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం. అంతేకానీ మీలా ఒక రూపాయ పెట్టి మొత్తం అంతా దోచుకుతినట్లేదు. మమ్మల్ని బలుపు అనడానికి మీరెవరు అసలు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నా.’’ అని తమ్మారెడ్డి భరద్వాజా హెచ్చరించారు.

Tags: counter to ycp mla prasannaproducer tammareddy bharadwajashocking commentsycp leaders
Previous Post

నల్లపురెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్… బలిసి కొట్టుకుంటుంది మేం కాదు మీరే..

Next Post

జగన్ తర్వాత సీఎం ఎవరో చెప్పిన రఘురామ

Related Posts

sajjala ramakrishna reddy
Trending

కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం

February 2, 2023
Trending

పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత

February 2, 2023
Movies

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

February 2, 2023
kotam reddy sridhar reddy
Trending

కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ

February 2, 2023
Trending

యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?

February 2, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Load More
Next Post

జగన్ తర్వాత సీఎం ఎవరో చెప్పిన రఘురామ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి
  • టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు
  • అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి
  • కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ
  • యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?
  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra