ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంకా అరుళ్ మోహన్ గురించి పరిచయాలు అక్కర్లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతో హిట్ అందుకుంది. తనదైన అందం, అభినయంతో తెలుగువారికి చేరువైంది.
వరుణ్ డాక్టర్, డాన్ వంటి సినిమాలతో కోలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్.. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ కు జోడిగా ఓజీ మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే నానితో ఆమె కలిసి నటించిన సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ప్రియాంకా బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగా ప్రియాంకా కొన్ని కామెంట్స్ చేసింది.
`ఓజీ లాంటి గొప్ప కథలో నేను భాగం కావడం, పవన్ కళ్యాణ్ సర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా బిగ్ థ్యాంక్స్. పవన్ కల్యాణ్, నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. అయితే నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్ సార్ కి ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు` అంటూ ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.