సాధారణంగా ప్రభుత్వాలు ఎక్కడైనా పరిశ్రమలు రాక ద్వారా, కొత్త ప్రయోగాల ద్వారానో డబ్బులు సంపాదించాలని చూస్తాయి. ప్రజల మీద భారం వేసేది కేవలం భూములు, ఇళ్ల ట్యాక్సులు, కరెంటు విషయంలో మాత్రమే. కానీ జగన్ సర్కారు వచ్చాక పేదలతో సహా అందరి నుంచి నేరుగా డబ్బును లాగేస్తోంది.
ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో జనానికి డబ్బులు పంచుతాను అని చెప్పిన వైఎస్ జగన్ రెడ్డి ఇపుడు డబ్బులు లాగేస్తున్నారు. ఈరోజు నుంచి నిరుపేదలకు కడుపు నింపే కేంద్రాలుగా పేరొందిన ప్రభుత్వ రేషన్ షాపుల్లో సరుకుల ధరలు పెంచారు జగన్. ఇలాంటి చర్య ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్… రేషన్ సరుకుల ధరలు తగ్గిస్తే జగన్ రెడ్డి పేదలు అయినా ప్రభుత్వానికి కట్టాల్సిందే అని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయినా మేము పంచే డబ్బులతోనే కదా రేషన్ సరుకులు కొనుక్కునేది, మీ జేబులు డబ్బులు పెడుతున్నారా అని వైసీపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు కిలో కంది పప్పు 40 రూపాయలకు ఇచ్చేవారు కానీ జగన్ ఏకంగా 27 రూపాయలు పెంచి 67 చేశారు. పెరిగిన ధరలతో కందిపప్పు కొనేందుకు లబ్ధిదారులు సముఖంగా ఉండరేమోనని రేషన్ డీలర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో దీనికంటే రూ. 20, 30లు మాత్రమే ధర వ్యత్యాసం ఉందని… పైగా చౌకదుకాణంలో ఇచ్చే కందిపప్పు నాణ్యత సరిగ్గా లేదని కార్డుదారులు అంటున్నారు. దీంతో ఆ మాత్రం డిస్కౌంటుకు రేషన్ షాపు దగ్గరకు వెళ్లడం ఎందుకు హాయిగా బయట మార్కెట్లో కొనడం బెటరని జనం భావిస్తున్నారని తెలుస్తోంది.
పేదలు ఇకపై కిలో కందిపప్పు రూ. 67 తో కొనాలి, చక్కెర కిలో రూ. 34 పెట్టి కొనాలి, నాలుగు నెలల క్రితమే జగన్ ఈ రేట్లు పెంచారు. అయితే, కేంద్రం వీటిని కరోనా వల్ల ఇంతకాలం ఉచితంగా ఇవ్వడంతో జగన్ వేసిన భారం నుంచి జనం తప్పించుకున్నారు. కానీ ఇకపై అది కూడా లేదు. జగన్ ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేయనుంది.