రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ టీం మాత్రం కేసీఆర్ కోసం. టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని ప్రశాంత్‌కిషోర్ తెలిపారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఆయన.. జాతీయ రాజకీయాలపై చర్చించారు. బీజేపీని ఢీకొట్టడంపైనా ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. మూడోకూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కోరారు.
బీజేపీ వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని కేసీఆర్‌కు ఈ సందర్భంగా పీకే వివరిం చారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని పీకే స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య రెండు రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన చర్చలు ఈరోజు కూడా కొనసాగాయి. రాష్ట్ర, జాతీయ రాజకీ యాలు, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో లోతుగా చర్చించినట్టు సమాచారం.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సేవలు కొనసాగించాలని టీఆర్ ఎస్ నిర్ణయించింది. సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లకు తెలంగాణ ఉద్య మంలో కేసీఆర్ పాత్ర, తదితర అంశాల ప్రచారంలో ఐప్యాక్ సేవలను టీఆర్ ఎస్ వినియోగించనుంది. సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు రోజులు సుదీర్ఘంగా జరిపిన మంతనాల్లో ఆయా అంశాలపై ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో.. పీకే హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న(ఏప్రిల్ 23న) ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న పీకే.. రాత్రి వరకు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ప్రగతిభవన్లోనే రాత్రి బస చేసిన పీకే.. ఈరోజు (ఆదివా రం) మరోసారి సీఎంతో భేటీ అయ్యారు.
రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి, లేదా పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా టీఆర్ ఎస్, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై, ప్రజాభిప్రాయంపై నిర్వహించిన సర్వేలను సీఎం కేసీఆర్‌కు పీకే విశ్లేషించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర పట్ల కొత్త ఓటర్లను ప్రభావితం చేసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే అంశంపై చర్చించినట్టు సమాచారం. ఇద్దరు త్వరలోనే మరోసారి భేటీ కానున్నట్లు తెలిసింది.