సెక్స్ కోరికలు.. మనుషులకు సహజం. కాని శృతిమించిన శృంగారం కేసులు తరచుగా వింటున్నాం. కానీ ఇటీవల ఒక మహిళ- వంద మంది పురుషులు.. అంటూ గత నెలలో కేరళ మహిళ గురించి ఎద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే, రాజకీయాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సంచలనం దేవెడగౌడ కుటుంబంలో జరిగింది.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ ( దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ పెద్ద కుమారుడు) శృంగార పిచ్చిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. 33 ఏళ్ల వయసున్న ప్రజ్వల్ కు ఇంత సెక్స్ పిచ్చా! అంటూ.. నోరెళ్ల బెడుతున్నారు. తాజాగా, ఈ కుటుంబం చుట్టూ.. శృంగార కుంభకోణం చుట్టుకుంది. ప్రజ్వల్ ప్రస్తుతం హాసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ, జేడీఎస్ కలిసిపోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగు చూసి అది వైరల్ గా మారింది.
దీనిలో ప్రజ్వల్ ఓ హైప్రొఫైల్ అధికారిణితో (తనకన్నా ఎక్కువ వయసున్న) సెక్స్‌లో ఉండడం సంచలనం రేపింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు.. రాజకీయ వివాదాలు రావడంతో సిద్దరామయ్య ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ దర్యాప్తులో ప్రజ్వల్ పెన్‌డ్రైవ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పెన్ డ్రైవ్ చూసిన తర్వాత అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే, అందులో ఏకంగా 3000 మంది మహిళలతో ప్రజ్వల్ సెక్స్ చేస్తున్న వీడియోలు కనిపించాయి. చిత్రం ఏంటంటే.. దీనిలో కొందరు మహిళా ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.
దీంతో మాజీ ప్రధాని మనవడు.. ప్రజ్వల్ కు ఇంత సెక్స్ పిచ్చా! అంటూ.. నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు, ఈ వ్యవహారం వైరల్ కావడం, ఇటు జేడీఎస్, అటు బీజేపీని ఇరకాటంలో పడేసేట్లు ఉండడంతో ప్రజ్వల్ జర్మనీ చెక్కేశాడు. దీంతో, ఆయనను తెప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏదేమైనా.. మాజీ ప్రధాని దేవెగౌడ సంపాదించుకున్న పరువు ప్రతిష్టలను ఇప్పుడు ఆయన మనవడు మట్టిపాలు చేయడం చర్చనీయాంశమైంది.